డబ్బులిచ్చి .. సిరా చుక్కేసి.. పిఠాపురంలో ఓటు దోపిడీ కాబోతుంది.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఇందుకు ప్రధాన కారణం. గత అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమిపాలు కావడంతో ఈసారి పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం సినీ పరిశ్రమ మొత్తం రంగంలోకి దిగింది.
పిఠాపురం రాజకీయం
మెగా ఫ్యామిలీతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ఖాయమైందని పలువురు సినీ ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టడం కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.

పిఠాపురంలో భారీగా నగదు పంపిణీ
ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో అప్పుడే వైసిపి నేతలు ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. పిఠాపురంలో నగదు పంపిణీ జరుగుతుందని పేర్కొన్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకునేందుకు వైసిపి కుట్ర చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని నాగబాబు ఆరోపించారు.
డబ్బులిచ్చి పవన్ కు ఓటేసే వారిని ఓటు వెయ్యకుండా చేసే కుట్ర
వైసీపీ నేతలు రేపు అర్ధరాత్రి నుంచి నగదు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు తెలిసిందని, వైసిపి గుండాలను, రౌడీలను రంగంలోకి దించిందని వారు ప్రతి ఇంటికి డబ్బు అందించడంతోపాటు డబ్బు తీసుకున్నట్టు సిరామార్కు వేస్తారంట అంటూ పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ కు ఓటు వేసే వారిని ఎల్లుండి ఓటు వేయకుండా అనర్హులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాగబాబు అన్నారు.
ఓటర్ మహాశయులార బీ అలర్ట్ మీ ఓటు దోపిడీ కాబోతుంది
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 11, 2024
సిరా పూసి ఓటు వెయ్యకుండానే మీ ఓటుని కాజేసే వైసిపి కుట్ర ని తరిమికొట్టండి....@ECISVEEP#beawareofbrastachars #castyourvote pic.twitter.com/vRdyD35ZSt
డబ్బులు తీసుకోండి.. తీసుకోకపోండి.. కానీ ఓటు వెయ్యండి
ఈ మేరకు తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ నాగబాబు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఓటర్ మహాశయులార బీ అలర్ట్ మీ ఓటు దోపిడీ కాబోతుంది అన్నారు . సిరా పూసి ఓటు వెయ్యకుండానే మీ ఓటుని కాజేసే వైసిపి కుట్ర ని తరిమికొట్టండి అంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుట్ర అమలు చేసేందుకు వైసిపి సన్నాసులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వేలిపై సిరా చుక్క వేస్తామంటే తిరస్కరించండి
వైసిపి గుండాలు ఇచ్చే డబ్బులు తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం అని కానీ ఓటు హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలని నాగబాబు ఓటర్లకు సూచించారు. వేలిపై సిరా గుర్తు ఉంటే ఆయా ఓటర్లను ఎన్నికల అధికారులు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని ఎవరైనా వేళ్ళపై సిరా చుక్క వేస్తామని చెబితే ప్రజలు తిరస్కరించాలని కోరారు. మిమ్మల్ని అడ్డుకోవడం అంటే మిమ్మల్ని చంపేయడమేనని, మీ ఆత్మగౌరవాన్ని కించపరచటమేనని చెప్పారు. నియోజకవర్గం లో జనసైనికులు, బిజెపి, టిడిపి కార్యకర్తలు పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని నాగబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications