పవన్ ,బాలకృష్ణ కలిసున్న ఫోటో షేర్ చేసిన నాగబాబు ... బాలయ్య విషయంలో యూటర్న్?
జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లు కలిసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణపై విరుచుకుపడిన నాగబాబు 2019 ఎన్నికలకు ముందు నుంచే బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు . పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే నాగబాబు బహిరంగంగానే బాలయ్య పై విరుచుకుపడ్డారు.

నిన్నటి దాకా బాలకృష్ణ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజా ఆసక్తికర పోస్ట్
ఇటీవల కరోనా సమయంలో సినిమా షూటింగ్లకు అనుమతుల విషయంలో బాలకృష్ణను సినీ పెద్దలు ఆహ్వానించకపోవడం పై బాలయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన సమయంలో చిరంజీవి నాగార్జున తదితరులు హాజరు కావడంపై బాలయ్య విమర్శలు గుప్పించారు. దీంతో బాలకృష్ణ ని టార్గెట్ చేసిన నాగబాబు ఆయన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా బాలకృష్ణ రాజకీయాలలో రెండు వేర్వేరు పార్టీలలో ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.

పవన్ , బాలయ్య కలిసున్న ఫోటో షేర్ .. బ్రదర్స్ టూ గెదర్ అంటూ పోస్ట్
నాగబాబు ప్రస్తుతం యు టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి ఉన్న ఒక పాత ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన నాగబాబు తన వద్ద అలాంటి ఫొటోలు చాలానే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఫోటోలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఈ ఫోటో పై వ్యాఖ్యలు చేసిన నాగబాబు బ్రదర్స్ టుగెదర్.. ఒకరు సొంత తమ్ముడు మరొకరు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని రాసుకొచ్చారు.

బాలయ్యను సోదరుడు అంటూ పేర్కొన్న నాగబాబు
ఇద్దరు సోదరులు కలిసిన వేళ ఒకరు నా సొంత సోదరుడు కాగా, మరొకరు నాకు లభించిన సోదరుడు అంటూ పవర్ స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజు అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు.
ఇదే ఫొటోకు మేము సినిమాను ప్రేమిస్తాము. ఆ తరువాతే ఏదైనా అని మరో కామెంట్‌ని జత చేశారునాగబాబు . ప్రస్తుతం నాగబాబు పోస్ట్ వైరల్ గా మారింది. నిన్న మొన్నటి దాకా బాలకృష్ణ మీద నిప్పులు చెరిగిన నాగబాబు ఒక్కసారిగా బ్రదర్ అండ్ కూల్ గా పోస్ట్ పెట్టడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Recommended Video

నాగబాబు యూ టర్న్ తీసుకున్నారా ? మరి ఏమై ఉంటుందో
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు చాలా రోజుల తర్వాత ఆసక్తికర పోస్ట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇక నాగబాబు వ్యాఖ్యల వెనక కారణం ఏమై ఉంటుందా అని ఈ పోస్టు చూసిన వారంతా తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
నందమూరి ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడుతున్నారు. మొన్నటి దాకా విమర్శలు చేసిన నాగబాబు ఒక పాజిటివ్ పోస్ట్ పెట్టటంతో నాబబు పోస్ట్ పై కూడా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు .
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications