నాగబాబు అనే నేను - ముహూర్తం, శాఖ ఖరారు..!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు తండ్రి - కుమారుడు, తాజా అన్నా - తమ్ముడు. మంత్రివర్గంలోని మెగా బ్రదర్ నాగబాబు ను తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభ సీటు.. ఇప్పుడు రాజ్య సభ సీటు చివరి నిమిషంలో నాగబాబుకు మిస్ అయ్యాయి. దీంతో, మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. మంత్రిగా నాగబాబు బాధ్యతల స్వీకరణ.. కేటాయించే శాఖ ముహూర్తం దాదాపు ఖరారు అయింది.

నిర్ణయం వెనుక
మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నారు. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్దమయ్యారు. ఆ సమయంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావటంతో..చివరి నిమిషంలో నాగబాబు కు అవకాశం దక్కలేదు. ఇక, తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇస్తారని ప్రచారం సాగినా.. కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ, రెండు టీడీపీకి ఖాయమయ్యాయి. దీంతో, రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్క లేదు. దీంతో, చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్ తో చర్చల తరువాత ప్రకటన చేసారు.

Nagababu to take oath as minister in next week Port folio finalised as reports

పవన్ తో చర్చలు
నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు. ప్రస్తుతం మండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీ లు రాజీనామా చేసారు. కానీ, వారి రాజీనామాలు ఆమోదం పొంద లేదు. ఛైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా మార్చిలో మరి కొందరు మండలి సభ్యులు పదవీ విరమణ చేయను న్నారు. దీంతో..ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆరు నెలల లోగా మండలి సభ్యుడు కావటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో, వెంటనే నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఆ తరువాత నాగబాబుతో మాట్లాడిన తరువాత నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.

నాగబాబు శాఖ ఖరారు
మంచి ముహూర్తం ఖరారు చేసుకొని.. మెగా కుటుంబ సభ్యులు డిసైడ్ చేసిన ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్ లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండనుంది. మెగా కుటుంబ సభ్యులు.. మూడు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక, ప్రస్తుతం అన్ని శాఖలు మంత్రులకు ఖరారయ్యాయి. కాగా, నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖ నాగబాబుకు ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేలా కొత్తగా ప్రభుత్వం - ప్రజల అనుసంధానం తో పాటుగా..గ్రీవెన్స్ పరిష్కరించేందుకు పోర్టు ఫోలియో ఖరారు చేసి ఆ బాధ్యత నాగబాబుకు ఇస్తారని తెలుస్తోంది. నాగబాబు మంత్రిగా బాధ్యతలు.. శాఖ పైన ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+