Nagarjunasagar Dam: ఏపీ ప్రభుత్వానిది దుస్సాహసం.. దుశ్చర్య: గుత్తా సుఖేందర్ రెడ్డి

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య మళ్ళీ కృష్ణా జలాల వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. తాజాగా ఏపీ నాగార్జున సాగర్ నుండి ఏపీకి నీళ్ళు విడుదలచేసిన ఘటన ఏపీ, తెలంగాణా పోలీసులకు మధ్య ఘర్షణకు కారణమైంది. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 13 గేట్లను అక్రమించి అక్రమంగా నీటి విడుదల చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం దుస్సాహసం చేసిందని పేర్కొన్నారు.

దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం సాగర్ పై దుశ్చర్యకు పాల్పడిందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. నల్లగొండలో తన నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ఆంధ్ర ఆధీనంలో, సాగర్ తెలంగాణ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.

Nagarjunasagar Dam: Gutta Sukhender Reddy fires on ap govt

కానీ దురాక్రమణ చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదన్నారు. ఎన్నికల పోలింగ్ నాడు ఆంధ్రా పోలీసులు నాగార్జున సాగర్ డ్యాం పై దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశించినా కూడా నీటి విడుదల ఆపకుండా, ఆంధ్ర పోలీసులు వెనక్కి పోవడం లేదని, ప్రజాస్వామ్యానికి ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు.

రాష్ట్రాల పరిధిలో వుండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయే విదంగా ఆంధ్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న సంపూర్ణ సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష ఆని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, సీఎం కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ కొడతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+