జగన్ అవినీతి కనిపించదా: మహేష్ కత్తికి నగేష్ రివర్స్ పంచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సనీ క్రిటిక్ మహేష్ కత్తిపై యాంటీ క్రిటిక్, రచయిత విజయ నగేష్ రివర్స్ పంచ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి చేస్తున్న వ్యాఖ్యలపై నగేష్ దుమ్మురేపుతూ కౌంటర్ ఇస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి ట్వీట్ చేసిన కొద్ది సేపటికే విజయ నగేష్ కౌంటర్ ఇచ్చారు. వినాశ కాలే విపరీత ట్వీట్లు అంటూ నగేష్ మహేష్ కత్తిపై విరుచుకుపడ్డారు. మహేష్ కత్తి మిడిసిపాటుకు భంగపాటు తప్పదని అన్నారు.

Nagesh gives counter to Mahesh Kathi

మహేష్ కత్తి ఉన్మాదానికి చరమ గీతం పాడాలని విజయన నగేష్ అభిప్రాయపడ్డారు. వేల కోట్ల జగన్ అవినీతి కనిపించని వైసిపి కత్తి మహేష్‌కు జనసేన విషయంలో అవినీతి కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

జనసేన విషయంలో అవినీతి ఆధారం చూపిన మరుక్షణం తన ట్విటర్ ఖాతాను డిలీట్ చేస్తానని విజయ నగేష్ సవాల్ విసిరారు. కత్తి అనుచరుడిగా మారిపోతానని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Writer Vijay Nagesh gave counter to Mahesh Kathi on the comments made against Jana Sena chief Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి