తొలిసారి పార్టీ ఆఫీస్‌కు చంద్రబాబు: పెళ్లి వేడుకలో ఇలా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేత హోదాలో ఆయన తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం సందడిగా మారింది.
కాగా, బుధవారం రాత్రి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అందించిన అభివృద్ధి, సంక్షేమం స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని బాగా తయారు చేశారని, కార్యాలయానికి వచ్చిపోయే వారికి స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయంలో కళా వెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని, వీలు చూసుకుని తాను కూడా పార్టీకి కొంత సమయాన్ని కేటాయించుకుని కార్యాలయానికి వస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్‌రెడ్డి లతోపాటు నారా లోకేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ప్రత్యేకత ఉందని, దానిని కార్యకర్తలు నిలుపుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఎంపీ రాయపాటి సాంబశివరావు గజమాలతో సత్కరించారు.
కాగా, గురజాల ఎమ్మెల్యేల యరపతినేని శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లు నవ దంపతులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications