విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధైర్యపడొద్దు: చెట్టును కోసిన చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తుఫాను బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టించే డీలర్లు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వారం రోజుల సహాయ, పునరావాస, పునరుద్ధరణ పనులను వివరిస్తూ.. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ సహాయం సక్రమంగా అందుతోందా లేదా అన్న అంశంపై జన్మభూమి హేబిటేషన్ కమిటీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. తుపాను వల్ల ఫౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతిందని, దాదాపు 37 లక్షల కోళ్లు మరణించాయని, వ్యవసాయ, ఆర్థిక శాఖల మంత్రులు, ఇతర అధికారులతో చర్చించి వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, సిద్ధా రాఘవరావు, సిఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

తుపాను వల్ల విద్యుత్ శాఖకు దాదాపు రూ 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 40 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరిగిందని, దీపావళి నాటికి 80 శాతం ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తుఫాను బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టించే డీలర్లు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

చెట్టును కోస్తూ..

చెట్టును కోస్తూ..

వారం రోజుల సహాయ, పునరావాస, పునరుద్ధరణ పనులను వివరిస్తూ.. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు పేద, ధనిక తారతమ్యం లేకుండా 25 కిలోల బియ్యం సహా 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల కందిపప్పు, కిలో పంచదార, లీటర్ పామాయిల్, కిలో ఉప్పు, అరకిలో కారం, 3 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలను 9 లక్షల కుటుంబాలకు అందించాలని నిర్ణయించామని చెప్పారు.

తుఫాను ధాటికి విరిగిపోయిన చెట్లు

తుఫాను ధాటికి విరిగిపోయిన చెట్లు

ఇప్పటికే గత మూడు రోజులుగా రేషన్ దుకాణాల ద్వారా వీటి పంపిణీ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

వీరితో పాటు తుపాను ప్రభావం పెద్దగా పడని ప్రాంతాల్లో సైతం ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో మరో 5 లక్షల కుటుంబాలకు సాయం అందుతుందని తెలిపారు.

వుడా పార్కులో..

వుడా పార్కులో..

ప్రభుత్వ సహాయం సక్రమంగా అందుతోందా లేదా అన్న అంశంపై జన్మభూమి హేబిటేషన్ కమిటీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

వుడా పార్కులో..

వుడా పార్కులో..

ఏజెన్సీలో సైతం తుపాను ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని, ఇక్కడ కాఫీ తోటలకు తీరని నష్టం వాటిల్లిందని అన్నారు.

వుడా పార్కులో..

వుడా పార్కులో..

నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ. 25వేల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

శుభ్రం చేస్తూ..

శుభ్రం చేస్తూ..

ఇక కొబ్బరి మొక్కలు పూర్తిగా ధ్వసమైపోయాయని, ఒక్కో కొబ్బరి మొక్కను తిరిగి బతికించేందుకు రూ. 50 వెచ్చించనున్నట్టు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

తుపాను వల్ల ఫౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతిందని, దాదాపు 37 లక్షల కోళ్లు మరణించాయని, వ్యవసాయ, ఆర్థిక శాఖల మంత్రులు, ఇతర అధికారులతో చర్చించి వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.

విశాఖవాసుల నినాదం

విశాఖవాసుల నినాదం

తుపాను బాధితులకు ధైర్యం చెప్పడంతో పాటు పునరావాస, పునరుద్ధరణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించిన చంద్రబాబు వారం రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి పయనమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎవరూ అధైర్య పడవద్దని, రెండు రోజుల్లోనే మళ్లీ వస్తానని, బాధితులు పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

విశాఖలో నీటి కష్టాలు

విశాఖలో నీటి కష్టాలు

వారం రోజుల పాటు విశాఖలోనే మకాం వేసిన తాను సమర్థవంతంగా పనిచేశానన్న సంతృప్తితో వెళ్తున్నానని చంద్రబాబు అన్నారు.

విశాఖ జూలో పరిస్థితి

విశాఖ జూలో పరిస్థితి

పెను విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖ నగరం అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

హైదరాబాద్ బయల్దేరి..

హైదరాబాద్ బయల్దేరి..

ప్రస్తుతం తాను వెళ్తున్నప్పటికీ సీనియర్, కీలక మంత్రులు నగరంలోనే ఉంటారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

హుదూద్ తుపాను ప్రభావంతో నష్టపోయిన అస్తులకు సంబంధించి బీమా క్లైములను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 25లోగా క్లైములకు తుదిగడువుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఇదే అంశంపై బీమా కంపెనీల యాజమాన్యాలతోను, కేంద్ర ఆర్థిక మంత్రితోను ఇప్పటికే చర్చించినట్టు ఆయన తెలిపారు.

పెను విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖ నగరం అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెనుగాలులకు విధ్వంసమైన సుందర విశాఖను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేంత వరకూ ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 23న విశాఖలో ‘తుపానును జయిద్దాం' పేరిట కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించనున్నట్టు సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, పిల్లలు, అధికారులు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోవాలని ఆయన పిలుసపునిచ్చారు.

English summary
The Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today expressed “partial satisfaction” over the efforts undertaken by administration in the three districts hit by cyclone Hudhud along the Andhra coast last Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X