నాటుకోడి కూర: బాబు, కేసీఆర్, అలీ హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ తీపి, బొమ్మడాయిలు వంటి కారం, మసాల వంటల గుమగుమలు, తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దాలయిన గంగిరెద్దులు, చిందు-యక్షగానం, బతుకమ్మ, బోనాలు, ఒగ్గు, బుర్ర కథలు, జానపద గేయాలు, ఆట-పాటలతో జల విహార్ ఆదివారం హోరెత్తింది.
దసరా పండుగ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, సికిందరాబాద్ లోకసభ సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆదివారం నగరంలోని నెక్లెస్ రోడ్డులో గల జల విహార్‌లో అలయ్-బలయ్ వేడుకను నిర్వహించారు. దత్తాత్రేయ ఆహ్వానం మేరకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర ఆహ్వానితులు వీటిని ఆస్వాదించారు, ఆరగించారు.
దసరా పండుగ సందర్భంగా దత్తాత్రేయ సుమారు పది సంవత్సరాలుగా ప్రతి ఏడాది అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా, ఎప్పుడూ లేని విధంగా ఈ దఫా ఘనంగా జరిగింది.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి నిర్వహించిన అలయ్-బలయ్ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పలువురు అధికారులు, అనధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అలయ్ బలయ్
ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అలయ్ - బలయ్ వేడుక సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సాగింది.

అలయ్ బలయ్
ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు 12-10 నిమిషాలకు ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కూడా వస్తున్నారన్న సమాచారం రావడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు డాక్టర్ కె లక్ష్మణ్, రామచంద్రారెడ్డి ప్రభృతులు అక్కడే నిలబడి స్వాగతం పలికారు.

అలయ్ బలయ్
వారంతా సభా వేదికపైకి చేరుకున్నారు. దత్తాత్రేయ ముఖ్య అతిథులందరికీ కండువాలు కప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నిమిషాలు ప్రసంగించి బయలుదేరారు.

అలయ్ బలయ్
జల విహార్ ప్రాంగణం నుంచి కేసీఆర్ బయలుదేరే సమయంలోనే, చంద్రబాబు కాన్వాయ్ అక్కడికి వచ్చేసింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు తారసపడి, ఆప్యాయంగా పలుకరించుకున్నారు.

అలయ్ బలయ్
ఆ తర్వాత కెసిఆర్ బయలుదేరగా, చంద్రబాబును దత్తాత్రేయ వేదికపైకి తీసుకుని వెళ్లారు. వేదికపై ఉన్న గవర్నర్ నరసింహన్‌ను, ఇతర ప్రముఖులను చంద్రబాబు పలుకరించారు.

అలయ్ బలయ్
చంద్రబాబు వెంట ఆ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి తదితరులు వచ్చారు.

అలయ్ బలయ్
కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు.

అలయ్ బలయ్
మధ్యాహ్నం ముఖ్య అతిథులు ప్రసంగించి వెళ్ళారు. కాగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాయంత్రం 4 గంటలకు జల విహార్‌కు చేరుకున్నారు.

అలయ్ బలయ్
వెంకయ్యనాయుడు వచ్చేంత వరకు గోరెటి వెంకన్న పాటలు, ఇతర జానపద కళాకారుల ఆట-పాటలు, లంబాడ నృత్యాలు కొనసాగాయి. వేడుక సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

అలయ్ బలయ్
బండారు దత్తాత్రేయ కండువాను తల రుమాలుగా కట్టుకోవడంతో, వెంకయ్య అది గమనించి, తానూ ఆ విధంగా కట్టుకున్నారు. దత్తాత్రేయ అభిమానులు ఆయనకు ఒక గొర్రెను బహూకరించారు.

అలయ్ బలయ్
అంబలి, పచ్చిపులుసు, పాశం, మటన్, బగారా, నాటుకోడి కూర, దప్పడం, మేక తలకాయ, కాళ్ళ కూర, కార్జం, సర్వపిండి, జొన్న రొట్టెలు, మలిజ ముద్ద, సకినాలు, గుడాలు, రొయ్యల వేపుడు, గుడ్డు పులుసు, బొమ్మడాయిలు, మక్కగారెలు, సల్లచారు, చింత పండు తొక్కు, పాలకూర పప్పు, సల్ల. ఇక, బతుకమ్మ, బోనాలు, గంగిరెద్దులు, చిందు-యక్షగానం, తుపాకి, ఒంటె, ఒగ్గు, బుర్ర కథలు ఆహూతులను అలరించాయి.

అలయ్ బలయ్
రాజకీయాలకు అతీతంగా దత్తన్న గత పదేళ్లుగా అలయ్ బలయ్ నిర్వహించడం అభినందనీయమని, దత్తాత్రేయ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఐకమత్యానికి ప్రతీకలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన మనందరికీ ఓ ఐకాన్ అని, ఈ కార్యక్రమం నిరంతరంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని కేసీఆర్ అన్నారు.

అలయ్ బలయ్
30 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నానని, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే వ్యక్తిని. భాష, ప్రాంతం, దేశం.. అనుబంధాలను పెంచుతాయని, రెండు రాష్ట్రాలూ భౌగోళికంగా వేరయ్యాయే తప్ప, మానసికంగా కలిసే ఉన్నామని, అయితే ఐకమత్యం అనేది మనసునుంచి రావాలని, వేదికలనుంచి కాదని చంద్రబాబు అన్నారు.

అలయ్ బలయ్
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఉంటేనే శక్తి ఉంటుంది. అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఉద్ఘాటించారు.

అలయ్ బలయ్
అలయ్ బలయ్‌లో గవర్నర్ మాట్లాడుతూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రేమతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఒక్కఅడుగు ముందుకేస్తే, సమాజం 10 అడుగులు ముందుకేస్తుందని హితవు పలికారు.

అలయ్ బలయ్
సమాజం- రాజకీయం ఆలింగనం (అలయ్-బలయ్) చేసుకోవాలని, సమాజం లేకపోతే రాజకీయం లేదని వ్యాఖ్యానించారు. మంచి కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహించారని అభినందిస్తూ, బండారు కాదు ‘బంధు' దత్తాత్రేయ అని అనగానే సభికులు కరతాళధ్వనులు చేశారు.

అలయ్ బలయ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భౌగోళికంగా రాష్ట్రాలు వేరైనా, కలిసి ఉందామని, ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అలయ్ బలయ్
అన్ని పార్టీల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ప్రతి ఏడాది ఇది నిర్వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయితే ఐకమత్యం అనేది మనసులో నుంచి రావాలని, వేదికల ద్వారా రాదన్నారు.

అలయ్ బలయ్
కొన్ని కోర్కెలు, ఆశలు సాధించుకోవడానికి కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించారు. మన తెలుగు వాళ్ళు అమెరికా, ఇతర దేశాల్లో ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.

అలయ్ బలయ్
తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలంగాణలో పార్టీ అధ్యక్షునిగా ఉన్నందున, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ, జై భారత్ అన్నారు.

అలయ్ బలయ్
ఇలాఉండగా సాయంత్రం జల విహార్‌కు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ జన్మభూమిని మరిచే వాళ్ళు మనుషులే కాదన్నారు.

అలయ్ బలయ్
దీపావళి, సంక్రాంతి, దసరా ఇలా అన్ని పండుగలకు శాస్ర్తియ కోణం ఉందని తెలిపారు. కులం, మతంకంటే గుణం మిన్న అని అన్నారు.

అలయ్ బలయ్
భాష, ప్రాంతాలు, రుచులు, అభిరుచులు వేరైనా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, ఎన్నికల్లో పోటీ చేసినా అభివృద్ధి విషయానికి వచ్చే సరికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు.

అలయ్ బలయ్
ఉదయం బండారు దత్తాత్రేయ ప్రారంభోపన్యాసం చేస్తూ రెండు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు కలిసి సోదరభావంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బంగారు తెలంగాణకు సహకరిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications