చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారికి వ్యాక్సిన్ వేసిన చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: రానున్న రెండేళ్లలో రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 9 నెలల నుంచి 16 నెలల వయస్సులోపల ఉన్న పిల్లల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పెంటావాలెంట్ టీకాను రాష్ట్రంలో మొదటిసారిగా గురువారం తిరుపతిలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులకు ఆయన చేతులమీదుగా టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యం దగ్గర నుంచి పెద్దల ఆరోగ్య సంరక్షణ విషయంలో రాష్ట్రం ఎంతగానో మెరుగుపడిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శిశు మరణాల విషయంలో తల్లిదండ్రులకు మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు. ఇందుకు ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలతో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ ట్యాబ్‌ల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్గించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ పెంటావెలెంట్ టీకాలు చిన్నపిల్లలకు ఒక సంజీవినిలాంటివన్నారు. చిన్నపిల్లలకు సంక్రమించే అవకాశం ఉన్న 5 ప్రాణాంతక వ్యాధులైన కంఠసర్పి, కోరింతదగ్గు, ధనుర్వాతం, హెపటైసిస్-బి, హెమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజాలను ఒక్క టీకాతో నివారించవచ్చన్నారు.

ప్రస్తుతం ఈ వ్యాధులకు వ్యాక్సిన్లు ఉన్నాయని, అయితే 9 పర్యాయాలుగా పిల్లలకు వేయాల్సి ఉండేదన్నారు. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఈ టీకాలు 16 నెలల్లో మూడుసార్లు వేస్తే చాలన్నారు. ఇలాంటి టీకాను తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తే ఆందోళన చెందాల్సి వస్తోందన్నారు. జాతీయ స్థాయిలో శిశు మరణాల రేటు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉందన్నారు.

దక్షిణ భారతదేశంలోనే మాతా-శిశు మరణాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కలగాలంటే ప్రతి మహిళా చదువుకోవడం అవసరమన్నారు. రూ. 125 కోట్లతో పెంటావాలెంట్ మందును రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుందన్నారు.

పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను ఓ ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రులకోసం ఆరోగ్యశాఖ తరపున రూ. 340 కోట్లు, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40 కోట్లతో మెరుగైన మౌలిక సదుపాయాలను అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

రానున్న రెండేళ్లలో రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

9 నెలల నుంచి 16 నెలల వయస్సులోపల ఉన్న పిల్లల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పెంటావాలెంట్ టీకాను రాష్ట్రంలో మొదటిసారిగా గురువారం తిరుపతిలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులకు ఆయన చేతులమీదుగా టీకాలు వేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యం దగ్గర నుంచి పెద్దల ఆరోగ్య సంరక్షణ విషయంలో రాష్ట్రం ఎంతగానో మెరుగుపడిందని ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శిశు మరణాల విషయంలో తల్లిదండ్రులకు మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు.
ఇందుకు ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలతో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ ట్యాబ్‌ల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్గించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ పెంటావెలెంట్ టీకాలు చిన్నపిల్లలకు ఒక సంజీవినిలాంటివన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

యాదగిరి మండలంలో ఉన్న అమరరాజా గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రోత్ కారిడార్‌ను, పలు ప్లాంట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

చంద్రబాబు

చంద్రబాబు

జిల్లా, రాష్ట్ర పారిశ్రామికీకరణలో అమరరాజా సంస్థల కృషిని ప్రశసించడమేకాక, ఉపాధి కల్పనలో స్థానికులకు మరింత ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం కెవి పల్లె మండలం అడవిపల్లె ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఏరియల్ సర్వే నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రాజెక్టు నిర్మాణం గురించి ప్రాజెక్టు మ్యాప్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడవిపల్లె ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

English summary
Two infants held by Chief Minister N. Chandrababu Naidu were vaccinated by Andhra Pradesh Health Minister Kamineni Srinivas, at Sri Padmavati Mahila Viswa Vidyalayam (SPMVV), here on Thursday, marking a historic launch of the 'Andhra Pradesh State Pentavalent Vaccine' programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X