ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తే పాకిస్థాన్ ను అంతం చేస్తాం.. ఉగ్రవాది సంచలన వార్నింగ్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య మరోసారి దాడులు జరిగాయి. ఇక ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్ జరుపుతున్న సంధి చర్చలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇక ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మధ్య వర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చల వెనుక అమెరికా ప్రయోజనాలు.. అలాగే ఒకవేళ పాకిస్థాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది సైఫుల్లా కసూరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.

అమెరికా ప్రమేయంతో జరుగుతున్న ఈ ఇరాన్ డీల్ లో పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ మీరు అమెరికా ఒత్తిడికి లొంగిపోయి ఇజ్రాయెల్ కు లేదా వారి అనుకూల శక్తులకు మద్దతు ఇస్తే మీరు పూర్తిగా నాశనం అవుతారు.. అని ఉగ్రవాది సైఫుల్లా కసూరి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు పాకిస్థాన్ ప్రభుత్వం, మిలిటరీ అంతర్జాతీయంగా ఒక శాంతి స్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య రాయబారం నడుపుతుంటే.. దేశీయంగా ఉన్న ఉగ్రవాద శక్తులు మాత్రం పాకిస్థాన్ ఆర్మీని తీవ్రవాద ఎజెండావైపు లాగాలని చూస్తున్నాయని అన్నాడు.

Pakistan Will Be Destroyed If It Supports Israel Saifullah Kasuri Delivers Sensational Warning Pak

ఇక సైఫుల్లా కసూరి ఐక్యరాజ్య సమితి నిషేధించిన లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయిద్ కూ అత్యంత ఆప్తుడు. అంతేకాకుండా గతేడాది జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఇతనే మాస్టర్ మైండ్ అని నివేదికలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+