గవర్నర్‌తో బాబు, విరాళాలు: లండన్‌లో పల్లె(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్‌భవన్ వెళ్లి, గవర్నర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమ విద్యుత్కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి, కార్మిక శాఖ నిధుల బదలాయింపు తదితర అంశాలను చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. కార్మిక శాఖ పరిధిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తమ వాటా నిధులను చట్టబద్ధంగా బదలాయించినందుకు ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయడం, వేధించడం తదితర అంశాలను గవర్నర్ ముందుంచినట్టు తెలిసింది. దీనివల్ల అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కూడా చంద్రబాబు తెలియచేసినట్టు తెలిసింది.

అదేవిధంగా శ్రీశైలం ఎడమ విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి వల్ల రాయలసీమ నీటి ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ప్రతి ఏడాది ఈ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విన్నవించినట్టు సమాచారం.

లండన్ చేరిన పల్లె

ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాలు, ఎన్‌ఆర్‌ఐ, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మంగళవారం ఘనస్వాగతం లభించింది. వారంరోజుల పర్యటన కోసం బ్రిటన్ ఆహ్వానం మేరకు ఆయన వెళ్లారు. బ్రిటన్, ఇండియన్ హైకమిషన్ అధికారులు, బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. బ్రిటన్ వెళ్లగానే నార్త్ ఐర్లండ్‌లోని బెల్‌ఫాస్ట్ సిటికి వెళ్లారు. బెల్‌ఫాస్ట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఐటి పరిశ్రమల్లోపెట్టుబడులకు గల అవకాశాలపై వివరించారు.

విరాళాలు

విరాళాలు

కెసిపి సిమెంట్ లిమిటెడ్ జెఎండి వి ఇందిరాదత్ చెక్కును ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్న దృశ్యం.

విరాళాలు

విరాళాలు

హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్ పార్క్ సీనియర్ సిటిజన్స్ రూ. 1,55,511 చెక్కును చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.

విరాళాలు

విరాళాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్‌భవన్ వెళ్లి, గవర్నర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌తో బాబు

గవర్నర్‌తో బాబు

ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమ విద్యుత్కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి, కార్మిక శాఖ నిధుల బదలాయింపు తదితర అంశాలను చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

గవర్నర్‌తో బాబు

గవర్నర్‌తో బాబు

కార్మిక శాఖ పరిధిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తమ వాటా నిధులను చట్టబద్ధంగా బదలాయించినందుకు ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయడం, వేధించడం తదితర అంశాలను గవర్నర్ ముందుంచినట్టు తెలిసింది.

గవర్నర్‌తో బాబు

గవర్నర్‌తో బాబు

ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కలిసిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఉద్యోగులు.

లండన్‌లో పల్లె

లండన్‌లో పల్లె

ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాలు, ఎన్‌ఆర్‌ఐ, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మంగళవారం ఘనస్వాగతం లభించింది.

లండన్‌లో పల్లె

లండన్‌లో పల్లె

బ్రిటన్ వెళ్లగానే నార్త్ ఐర్లండ్‌లోని బెల్‌ఫాస్ట్ సిటికి వెళ్లారు. బెల్‌ఫాస్ట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఐటి పరిశ్రమల్లోపెట్టుబడులకు గల అవకాశాలపై వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+