ఇది మరో చరిత్ర, ఇన్నోవా కార్లు ఇస్తున్నాం: బాబు, అక్కడే జగన్ దెబ్బ తిన్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు విచారించి, సమస్యలను నమోదు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు.

బాబు ఇలాకాలో జగన్‌కు రెండో షాక్: పెద్దిరెడ్డి-మిథున్ రెడ్డిలకు దెబ్బ, టిడిపి చక్రం

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. టిడిపికి వెన్నెముక అయిన బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, వాటినీ వివరించాలన్నారు.

ఇన్నోవా కార్లు ఇస్తున్నాం

ఇన్నోవా కార్లు ఇస్తున్నాం

ఇంటింటికి తెలుగు దేశంపై ఆదివారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఎన్నో చేస్తున్నామని చెప్పారు. వాటిన్నింటిని వివరించాలని తెలిపారు. ఎస్సీలకు నెలకు 75 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేస్తున్నామని, ఎస్సీ ఆడ బిడ్డలకు రూ.35,000, బీసీలకు రూ.30,000 పెళ్లి కానుకగా అందిస్తామని, ఇమాం, మౌజన్లకు జీతాలు ఇస్తున్నామని, విదేశీ విద్యకు రూ.10 లక్షలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, రుణ, ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇన్నోవా కార్లు పంపిణీ చేస్తున్నామని, వీటన్నింటినీ వివరించాలన్నారు.

నంద్యాలలో ముస్లీంల మద్దతు కొత్త చరిత్ర

నంద్యాలలో ముస్లీంల మద్దతు కొత్త చరిత్ర

కాకినాడ ఎన్నికల్లో ఎస్సీలంతా టిడిపికి అండగా నిలిచారని చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ముస్లింలు ఏకపక్షంగా మద్దతు పలకడం కొత్త చరిత్ర అన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఇది స్ఫూర్తి కావాలన్నారు. సకాలంలో జోక్యం చేసుకుని గరగపర్రు, దేవరాపల్లి ఉద్రిక్తతలను నివారించామన్నారు. రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందాలని చూసిన ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేశామన్నారు.

80 శాతం మంది టిడిపికి మద్దతు

80 శాతం మంది టిడిపికి మద్దతు

నంద్యాలలో ముస్లీంలు, కాకినాడలో ఎస్సీలు టిడిపికి అండగా నిలబడటం మరో చరిత్ర అని చంద్రబాబు అన్నారు. బలహీనవర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల్లో 80 శాతం మంది టిడిపికి అండగా ఉండేలా వారిలో అవగాహన పెంచాలన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లీంలతో కాంగ్రెస్, వైసిపిలో ఓట్లు వేయించుకొని మోసం చేశాయన్నారు. మనం పనులు చేస్తున్నామన్నారు. నంద్యాల ప్రజలకు బాబు థ్యాంక్స్ చెప్పారు.

కేంద్రం పరిధిలో మాదిగ రిజర్వేషన్ల అంశం

కేంద్రం పరిధిలో మాదిగ రిజర్వేషన్ల అంశం

మాదిగల రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం చేయాల్సినదంతా చేసింది, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని తెలిపారు.

నంద్యాలపై ఇది చంద్రబాబు లెక్క.. జగన్‌కు షాక్

నంద్యాలపై ఇది చంద్రబాబు లెక్క.. జగన్‌కు షాక్

గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలోని ముస్లీంలు, రెడ్లు, ఎస్సీలు మెజార్టీ వైసిపికి మద్దతు పలికారు. ముస్లీంలు 60వేలకు పైగా, రెడ్లు 30వేలకు పైగా, ఎస్సీలు 30వేలకు పైగా ఉన్నారు. 2014లో వైసిపికి అండగా నిలబడ్డ వీరు.. ఇప్పుడు టిడిపికి మద్దతిచ్చారు. ఇక్కడు కూడా జగన్ దెబ్బతిన్నారు. దీనిని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister and TDP Supremo Chandrababu Naidu will be in Nandyal on 19th to thank the voters of the constituency who voted the party to power with an incredible majority. The Chief Minister will also review the development works taken up there.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి