విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు- స్పందన కరవు ?
విశాఫట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిస్ధితులపై రాజకీయ నేతలంతా స్పందిస్తున్నారు. పరిస్ధితిపై ఇప్పటికే స్ధానిక నేతల నుంచి సమాచారం తీసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు వీలైతే నగరానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో సీఎం జగన్ విశాఖ బయలుదేరుతుండగా... విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఘటనా స్ధలికి వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరారు.
లాక్ డౌన్ ప్రారంభం కాగానే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు... ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ఆయనకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తాను విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని చంద్రబాబు కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేసినట్లు తెలిసింది. కేంద్రం అనుమతి లభిస్తే సాయంత్రానికి చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళ్లాలని భావిస్తున్నారు.. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రుల పరామర్శకు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది.

Recommended Video
అయితే మధ్యాహ్నం వరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు విశాఖలోని పార్టీ నేతలకు ఫోన్ చేసి సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కోరారు. తాను మాత్రం హైదరాబాద్ నివాసం నుంచే పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications