జగన్ ఒప్పుకోనిది చంద్రబాబు ఒప్పుకుంటారా ? బాలయ్య ధీమా ఏంటి ?
ఏపీలో సినీ హీరో కమ్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడైనా ఏనాడూ అధికార పీఠం కావాలనుకోలేదు, తన బావ చంద్రబాబుకు అండగానే నిలిచారు. ఇదే క్రమంలో ఆయన ఏమైనా సాధించుకున్నారా అంటే అదీ కనిపించదు. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ కీలక అంశంలో తన పంతం నెగ్గించుకునేందుకు సిద్దమవుతున్నారు.
గతంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. అప్పట్లో అనంతపురం జిల్లా విభజించి అందులో నుంచి సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ఎంపిక చేశారు. దీంతో అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కానీ అప్పట్లో తన నియోజకవర్గమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని బాలయ్య ఎంత పట్టుబట్టినా అప్పటి సీఎం జగన్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన కూడా ఈ విషయం మర్చిపోయారు.

కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు డిమాండ్ ను బాలకృష్ణ తెరపైకి తెస్తున్నారు. దీనికి కాస్త సెంటిమెంట్ ను కూడా జోడించి బావ చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు హిందూపురం అంటే ఎంతో అభిమానమని, అందుకే ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేసారని తెలిపారు. దీనికి అదనంగా జిల్లా పేరును సత్యసాయిగానే ఉంచి జిల్లా కేంద్రంగా మాత్రం పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలని చంద్రబాబును కోరబోతున్నట్లు బాలయ్య ఇవాళ వెల్లడించారు.












Click it and Unblock the Notifications