బాలయ్య చిన్నల్లుడి నియోజకవర్గం మార్పు? విశాఖ ఎంపీ అభ్యర్థి ఖరారు?
కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం కళాశాలల చైర్మన్ భరత్ గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈసారి భరత్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్టానం మార్చబోతోంది. భీమిలీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి నింపేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లాలో పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక మార్పులు చేస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గంటా శ్రీనివాసరావుతో చర్చించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం బదులు గాజువాక నుంచి గంటాను బరిలోకి నిలపాలని, ప్రస్తుతం గాజువాక ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులను విశాఖపట్నం ఎంపీగా బరిలోకి నిలపాలని పార్టీ భావిస్తోంది. విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్‌కుమార్ వైసీపీలోకి వెళ్లి అక్కడ ఇమడలేక ఇక్కట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని తిరిగి తీసుకునే ఉద్దేశం మాత్రం టీడీపీకి లేదని స్పష్టమవుతోంది.

విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు మేనల్లుడు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అక్కడి నుంచి గంటా మేనల్లుడిని బరిలోకి నిలపడంద్వారా యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లవడంతోపాటు ఆర్థికంగా అండగా ఉంటారనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ప్రాతినిధ్యం వహించిన గాజువాక నుంచి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారన్న విషయం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications