ఎన్టీఆర్ 95వ జయంతి: నందమూరి కుటుంబం ఘనమైన నివాళి..

Recommended Video

    ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భారీ సంఖ్యలో అభిమానులు

    హైదరాబాద్: దివంగత సీఎం, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు 95వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఉదయం 7గం.కి నందమూరి హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.

    ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ జయంతి ఒక పర్వదినం లాంటిదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఎన్ని తరాలైనా, యుగాలైనా సరిపోవని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చారని, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని హరికృష్ణ విజ్ఞప్తి చేశారు.

    nandamuri family pay tributes to sr ntr

    తెలుగువారికీ ఒక భాష ఉందని నిరూపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తరాల పాటు చెప్పుకునేలా ఎన్టీఆర్ చేసిన సేవలు సాగాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. హరికృష్ణ మాట్లాడుతున్న సమయంలో మహానాడుపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. ఒకప్పుడు పార్టీలో రథసారధిగా ఉన్న మీరు మహానాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు హరికృష్ణ సమాధానం దాటవేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+