10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది
Recommended Video

నల్గొండ: మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బుధవారం వేకువజామున నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు బోల్దా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు మరికొందరు ఉన్నారని తెలుస్తోంది.

అతివేగమే ప్రమాదానికి కారణం
అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. కారు వేగంగా వెళ్తోందని చూసిన వారు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లి బోల్తా పడింది.

పదినిమిషాల్లోనే ఆసుపత్రికి
ఈ ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే హరికృష్ణను ఆసుపత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కాపాడలేకపోయారు.

కుటుంబ సభ్యుల రాక
ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హుటాహుటిన కామినేని ఆసుపత్రికి బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఎన్టీఆర్ నాలుగో సంతానం
ఎన్టీఆర్, బసవతారకం నాలుగో సంతానం హరికృష్ణ. ఆయన సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967లో శ్రీ కృష్ణావతారం సినిమాతో సినిమాల్లోకి ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన శ్రీరాములయ్యతో 1998లో మరోసారి తెరపై కనిపించారు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.

పెద్దకొడుకు జానకిరాం ఇక్కడే మృతి
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణే నడిపించారు. 1995లో టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక అన్న తెలుగుదేశంను స్థాపించారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కూడా 2014 జనవరిలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఆ ప్రమాదం కూడా నల్గొండ జిల్లా పరిధిలోనే జరిగింది.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications