మేం ఏం గాజులేసుకోలేదు, చంద్రబాబుపై ద్వారంపూడి వ్యాఖ్యలపై నందమూరి రామకృష్ణ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ స్పందించారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డ సంగతి తెలిసిందే. ద్వారంపూడి కామెంట్లపై రామకృష్ణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు.

నందమూరి రామకృష్ణ రియాక్షన్
‘వాడోవడో కాకినాడ సిటీ ఎమ్మెల్యేనట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. తాను ఎమ్మెల్యే హోదాను మరచిపోయాడు. అందుకే చంద్రబాబు నాయుడుపై నోరుజారాడు. మేం గాజులు తొడుక్కోలేదు, మేం కూడా నోరుజారమనుకో, ఇక మీ జాతకం బయటపెట్టాల్సింది.. కానీ తెలుగుదేశం పార్టీ, నేతలుగా సంస్కారం ఉంది. చంద్రబాబు వయస్సు ఎంత, అనుభవం ఎంత ?.. స్వర్గీయ ఎన్టీఆర్ మూడో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు, మా బావ.. కుటుంబం జోలికి మాత్రం రావ్వొద్దు, వజ్రం వజ్రం చేతిలో కొయాలి అన్నట్టు మమ్మల్ని రెచ్చగొట్టకు, అదీ నీ చేతిలో ఉంది' అంటూ నందమూరి రామకృష్ణ.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఎమ్మెల్యేనా..?
ఇటీవల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని నందమూరి రామకృష్ణ అన్నారు. తాను ప్రజా ప్రతినిధినని, ఎమ్మెల్యే అనే విషయం మరచిపోయినట్టున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైరయ్యారు. ద్వారంపూడి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని నందమూరి రామకృష్ణ ప్రకటిచారు.

నోరు తెరిచామో..
చంద్రశేఖర్ రెడ్డి మీరు నోరుజారారు, తీరు మార్చుకోవాలని నందమూరి రామకృష్ణ హితవు పలికారు. లేదంటే తాము నోరు తెరిస్తే మీ బండారం బయటపడుతుందని హెచ్చరించారు. మీ జాతకం ఎంటో చెప్పేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. మీరు అలా విరుచుకుపడుతుంటే మేం చేస్తూ ఊరుకోలేం.. గాజులు తొడుక్కొలేమని నందమూరి రామకృష్ణ ఘాటుగా స్పందించారు.

వయస్సు, అనుభవం
చంద్రబాబు నాయుడు వయస్సు ఏంటీ, ఆయన అనుభవం ఏంటీ అని నందమూరి రామకృష్ణ గుర్తుచేశారు. ఆయనతో ఏ విషయంలోనైనా సరితూగగలవా అని ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు.. స్వర్గీయ ఎన్టీఆర్ మూడో అల్లుడు, మా బావగారు అంటూ చెప్పారు. మాటకు మాట మేం కూడా చెప్పగలం.. కానీ సభ్యత కావాలి, సంస్కారం కావాలన్నారు. రాజకీయంగా మాట్లాడితే ఓకే.. కానీ కుటుంబం జోలికి మాత్రం రాకూడదని కోరారు.

ఇదీ విషయం..
ఇటీవల అమరావతి రైతుల ఆందోళన ప్రస్తావించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు. వెధవ అని తిట్టాలని ఉందంటూ ఫైరయ్యారు. తన బినామీల కోసం చంద్రబాబు.. అమరావతి పరిరక్షణ పేరుతో బస్సుయాత్ర చేపడుతున్నారని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంతో చంద్రబాబు వెధవ పనులు చేశారని ఆరోపించారు. ద్వారంపూడి వ్యాఖ్యలపై నందమూరి రామకృష్ణ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే తాము కూడా అదేరీతిన స్పందిస్తామని హెచ్చరించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications