Tarakaratna: తారకరత్న ఆస్పత్రికి వచ్చేసారికి పల్స్ పడిపోయింది: వైద్యులు

లోకేష్ యువగళం పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన తారకరత్న.

సినీ నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు.లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. తారకరత్నను హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.

తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించమన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల తర్వాత మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి పెరిగింది.

Nandamuri Tarakaratna Lokesh fell seriously ill during the padayatra

పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి అటు నుంచి బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితిని సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+