బీజేపీ దేశానికే ప్రమాదకరం, అవి అసలు ఎన్నికలే కాదు: రఘువీరారెడ్డి
దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, టీడీపీ- వైసీపీ రెండూ బీజేపీ అనుబంధ సంస్థలని ఆయన అన్నారు.
విజయవాడ: దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, టీడీపీ- వైసీపీ రెండూ బీజేపీ అనుబంధ సంస్థలని ఆయన అన్నారు.
విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పార్టీల నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కాదని అన్నారు.

ఆ రెండు చోట్లా ఎన్నికలు పూర్తిగా అనైతికంగా జరిగాయని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఘోరంగా విఫలం చెందిందన్నారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అనే విధంగా తాము పని చేస్తామని ముక్తాయించారు.












Click it and Unblock the Notifications