నంద్యాలపై వ్యూహాలు: శిల్పాకు చెక్ చెప్పేందుకు అఖిలప్రియ ఇలా..
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నాయి. భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరుతూ టిడిపి నంద్యాలలో సరికొత్త యాత్రకు సిద్ధమైంది.

టిడిపి సరికొత్త యాత్ర!
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆశీర్వాద యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మనంద రెడ్డి, వైసిపి తరఫున మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు.

నువ్వా.. నేనా అన్నట్లుగా..
అయితే, ఇంకా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకముందే కర్నూలు జిల్లా రాజకీయాల్లో వాతావరణం వేడెక్కింది. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ప్రస్తుతం నంద్యాలలో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్ధితి ఉందని అంటున్నారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

ఇప్పటికే చంద్రబాబు, నారాయణ పర్యటనలు
ఇటీవల సీఎం చంద్రబాబు ఇప్తార్ విందు పేరుతో నంద్యాలలో పర్యటించారు. మంత్రి నారాయణ కూడా రెండుసార్లు నంద్యాలను చుట్టివచ్చారు.

అఖిల - శిల్పాల సవాళ్లు, ప్రతి సవాళ్లు
ఇక స్థానికంగా మంత్రి భూమి అఖిలప్రియ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. తన సోదరుడిని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసిరారు. నంద్యాలలో టిడిపి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అఖిల సవాల్ విసిరారు. శిల్పా కూడా ధీటుగానే స్పందించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications