నిజమైన లగడపాటి సర్వే, కానీ: కొట్టాడని వెనక్కి.. గుండెలు బాదుకుంటూ జగన్

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమైంది.ఎన్నికల సర్వేల్లో ఆయన లెక్కలు దాదాపు నిజమవుతున్నాయి.

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమైంది. ఎన్నికల సర్వేల్లో ఆయన లెక్కలు దాదాపు నిజమవుతున్నాయి.

ఇప్పుడు టిడిపి గెలుపు కూడా నిజమైంది. కానీ మెజార్టీ మాత్రం ఆయన చెప్పిన దాని కంటే ఎక్కువ వచ్చింది. నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక ఓటరు నాడిపై లగడపాటి నిర్వహించిన ఆర్జీ ఫ్లాష్ సర్వే 4 రోజుల కిందట వెల్లడించారు.

మెజార్టీలోనే తప్ప

మెజార్టీలోనే తప్ప

టిడిపి తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్నారు. కానీ 27 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచింది. నంద్యాలలో టిడిపి 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని, 1,73,335 మంది ఓటు వేసినందున 17,333 ఓట్ల మెజారిటీ టిడిపికి రావచ్చని, ఇది 15 వేలైనా లేదా 20 వేలకైనా కావొచ్చని లగడపాటి చెప్పారు. ఆయన చెప్పినట్లు టిడిపి గెలిచింది. మెజార్టీ మాత్రం కొంత అటు ఇటు అయింది.

తప్పని పరిస్థితుల్లో బాబుకు ఓటు అని జగన్

తప్పని పరిస్థితుల్లో బాబుకు ఓటు అని జగన్

నంద్యాల గెలుపుపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఇవాళ నేను చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆయన ఇప్పుడే అధికారం నుంచి తప్పుకోరు కాబట్టే, ఎలాగో ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగాలి కాబట్టి, గత్యంతరం లేక ఆయన ప్రలోభాలాకు లొంగి ప్రజలు ఓట్లు వేశారని జగన్ అన్నారు.

రెఫరెండంపై..

రెఫరెండంపై..

2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక రెఫరండం అని అనుకుంటున్న విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. జగన్ స్పందించారు. 'ఇది రెఫరెండం ఎలా అవుతుందమ్మా?.. నువ్వే చెప్పమ్మా? నాకు ఒకటి చెప్పు... ఒకే ఒక చోట ఎలక్షన్ జరపడం, మొత్తం 200 కోట్ల డబ్బు పెట్టడం, మొత్తం మంత్రులందరినీ కూర్చోబెట్టడం, పోలీసులందరినీ భయబ్రాంతులను చేసే విధంగా వాడుకోవడం, ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసి ఎలక్షన్ చేస్తే అది రెఫరెండం అవుతుందా? నీకు రెఫరెండం అంటే ఏంది?' అని జగన్ అన్నారు.

20 చోట్ల నీ మాట వింటారా చూస్తాను

20 చోట్ల నీ మాట వింటారా చూస్తాను

చంద్రబాబుకు ఇవాళ నేను సవాల్ విసురుతున్నానని, మన పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలనూ ఒకేసారి తీసుకొని రా, అప్పుడు చూస్తా నేను, 20 చోట్ల నువ్వు రెండొందల కోట్లు ఎలా ఖర్చుపెడతావో అని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. 20 చోట్ల పోలీసులు నీ మాట వింటారేమో నేను చూస్తా అన్నారు. 20 చోట్ల నువ్వు ఎలా భయపెట్టగలవో నేను చూస్తానని, అది రెఫరెండం మీనింగ్ అని జగన్ అన్నారు.

గుండెలను బాదుకుంటూ జగన్ ఇలా

గుండెలను బాదుకుంటూ జగన్ ఇలా

'అంతేగానీ, ఇదేందండీ, ఒకే నియోజకవర్గం. ఒకటే బయటకు తీస్తారు. దాంట్లోనే బై ఎలక్షన్ అంట.. 200 కోట్ల డబ్బంట.. పోలీసులంట.. భయబ్రాంతులంట.. ఇన్ని చేసి అది రెఫరెండం ఎలా అవుతుందండీ? దీన్ని రెఫరెండం అనే వాళ్లకు సెన్స్ ఉండాలి. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లను చంద్రబాబు మళ్లీ తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే ధైర్యం, కాన్ఫిడెన్స్ తనకు లేదు. పాలిటిక్స్‌లో ఉండాల్సింది.. ధైర్యముండాల(గుండెలను బాదుకుంటూ).. గుండె ధైర్యముండాల. ఎదుటివాడు గట్టిగా కొట్టాడని చెప్పి వెనక్కిపోతాం తప్ప.. కొట్టాడు.. కొట్నాడు కాబట్టి(తడబడుతూ..) అనుకోవాల్సిన పనిలేదు' అని జగన్ అన్నారు. ఇదిలా ఉండగా, నంద్యాలలో టిడిపి గెలిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+