వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమా మౌనిక పోలింగ్ బూత్‌ల్లోకి ఎందుకు వెళ్లారంటే! గొడవలపై శిల్పా వ్యాఖ్య

టిడిపి నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ సెంటర్‌లలోకి వెళ్లి ప్రచారం చేశారని వైసిపి ఆరోపించింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: టిడిపి నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ సెంటర్‌లలోకి వెళ్లి ప్రచారం చేశారని వైసిపి ఆరోపించింది.

భూమా మౌనికపై వైసిపి సంచలన ఆరోపణలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారుభూమా మౌనికపై వైసిపి సంచలన ఆరోపణలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు

అయితే భూమా అభిమానుల వాదన మరోలా ఉంది. ఆమె భూమా నాగిరెడ్డి లేని లోటును తీర్చుతున్నారంటున్నారు. పోలింగ్‌ను భూమాలా పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.

గొడవలు జరగకుండా అనుమతితో పరిశీలన

గొడవలు జరగకుండా అనుమతితో పరిశీలన

నంద్యాల ఉప ఎన్నికలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు. మరోవైపు టిడిపి, వైసిపి అభ్యర్థులకు అనుకూలంగా పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్, గొడవలు జరుగుతాయని అభ్యర్థుల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని పరిశీలిస్తున్నారు.

Recommended Video

Nandyal By election Polling Update, Drones to keep hawk eye on Nandyal | Oneindia Telugu
భూమా నాగిరెడ్డిలా..

భూమా నాగిరెడ్డిలా..

ముఖ్యంగా భూమా నాగమౌనిక తండ్రి లేని లోటు తీరుస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఫ్యాక్షన్ పడగ విప్పే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గతంలో భూమా నాగిరెడ్డి పర్యవేక్షించేవారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేవారని, ఇప్పుడు ఆయన రెండో కుమార్తె నాగ మౌనిక కూడా ఆయనలా స్వయంగా తిరిగి పరిశీలన చేస్తున్నారని చెబుతున్నారు.

గొడవలు సృష్టించే ప్రయత్నమని శిల్పా

గొడవలు సృష్టించే ప్రయత్నమని శిల్పా

భూమా నాగ మౌనిక డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరించారు. మధ్యాహ్నం నుంచి ప్రత్యర్థులు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ ‌రెడ్డి మీడియాకు వివరించారు.

సరికొత్త యాప్

సరికొత్త యాప్

కాగా, 'నంద్యాల బైఎలక్షన్స్‌ 2017 యాప్‌'ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ఉప ఎన్నికలో ఏమైనా సమస్యలు ఉంటే ఫొటోలు, వీడియోలు యాప్‌ ద్వారా పంపితే సెంట్రల్‌ కమాండ్ కంట్రోల్‌ రూంకు సమాచారం చేరుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఈ యాప్‌ ద్వారా పోలింగ్ కేంద్రాల సమాచారం, చిరునామా తెలుసుకోవచ్చు.

English summary
Voting today began across 255 polling stations in Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X