వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: వైసీపీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నంద్యాలలోనే జగన్ మకాం?

నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారంనాడు వైసీపీలో చేరారు. సంజీవరెడ్డితో పాటు ఆయన తనయులు కూడ వైసీపీలో చేరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారంనాడు వైసీపీలో చేరారు. సంజీవరెడ్డితో పాటు ఆయన తనయులు కూడ వైసీపీలో చేరారు. నంద్యాల అసెంబ్లీకి స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ నంద్యాలలోనే 15రోజులపాటు మకాం వేయనున్నారు.ఈ స్థానంలో విజయం సాధించేందుకు ఆయన వ్యూహన్ని రచిస్తున్నారు.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 22న, మరోసారి నంద్యాలలో పర్యటించనున్నారు.

'వైసీపీ జైత్రయాత్ర', 'అలజడులకు ఫ్యాక్షనిస్టులు, రౌడీలా', బాబు టూర్'వైసీపీ జైత్రయాత్ర', 'అలజడులకు ఫ్యాక్షనిస్టులు, రౌడీలా', బాబు టూర్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికను అధికార టిడిపి, విపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

ఈ స్థానంలో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు వ్యూహన్ని రచిస్తున్నాయి. అధికారపార్టీ ఆరుగురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. వైసీపీ కూడ నంద్యాలలో ఒక్కో వార్డుకు ఇద్దరేసి ఇంచార్జీలను నియమించింది.

వార్డుకు ఇద్దరు వైసీపీ, ఆ మంత్రులు నంద్యాలలోనే, రోడ్ల విస్తరణ దెబ్బేనా?వార్డుకు ఇద్దరు వైసీపీ, ఆ మంత్రులు నంద్యాలలోనే, రోడ్ల విస్తరణ దెబ్బేనా?

అంతేకాదు రాయలసీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను, పార్టీకి చెందిన ముఖ్యులను వైసీపీ నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో ప్రచార బాధ్యతలను అప్పగించింది.

 వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి శుక్రవారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరినట్టుగా వైసీపీ నేతలు ప్రకటించారు. సంజీవరెడ్డితోపాటు ఆయన తనయులు కూడ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడడం టిడిపికి ఇబ్బంది కల్గించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

నంద్యాలలో ఎనిమిది మంత్రులు

నంద్యాలలో ఎనిమిది మంత్రులు

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డిని గెలిపించేందుకుగాను 8 మంది మంత్రులు పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. మంత్రులు అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మాటలగారడీలు చేస్తూ ముఖ్యమంత్రి నంద్యాలకు వస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్ససత్యనారాయణ ఆరోపించారు.

నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత

నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత

రోడ్ల విస్తరణ పేరుతో కనీసం నోటీసులు కూడ ఇవ్వకుండానే షాపులను కూల్చివేస్తున్నారని బొత్స విమర్శించారు. ఓట్లకోసం రోడ్ల విస్తరణను ఇప్పుడు ముందుకు తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టే హమీలను ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు మరోసారి నంద్యాలలో పర్యటించనున్నారని ఆయన ఎద్దేశా చేశారు.

బాబు, జగన్ పర్యటనలు

బాబు, జగన్ పర్యటనలు

ఈ నెల 22వ, తేదిన ఏపీ సిఎం చంద్రబాబునాయుడు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. గత నెలలోనే ఆయన నంద్యాలలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ చీప్ వైఎస్ జగన్ కూడ నంద్యాలలో సుమారు 15 రోజులపాటు మకాం వేసే అవకాశాలున్నాయని సమాచారం. నంద్యాలలోనే ఆయన మకాం వేసి పార్టీ క్యాడర్‌కు అవసరమైన సూచనలను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

English summary
Nandyal former MLA Sanjeeva reddy joined in Ysrcp on Friday. He resigned to Tdp joined in Ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X