ఆయన ఉన్నంతకాలం అడుగుపెట్టను: నన్నపనేని
హైదరాబాద్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారికి మధ్య గురువారం మండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూతబడిన పరిశ్రమలపై చర్చలో తనకు అవకాశం ఇవ్వలేదని నన్నపనేని సతీష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలిలో అధికార పక్షాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకు కారణమైన సతీష్‌రెడ్డి సభలో ఉన్నంతవరకు మండలిలో అడుగుపెట్టనంటూ ఆమె వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లి పోయారు.
ఫ్యాక్షనిస్టు అంటారా?: జగన్ పార్టీపై అనిత

అసెంబ్లీలో జరుగుతున్న కార్యకలాపాలను 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారన్న భయం లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం సభ్యురాలు అనిత తీవ్రంగా ధ్వజమెత్తారు. డాక్టర్ విద్యను అభ్యసించిన స్పీకర్ కోడెలను విపక్ష సభ్యులు ఫ్యాక్షనిస్టు అని సంభోదించారని, ఇది ఎంతమాత్రం సరికాదని ఆమె అన్నారు.
అతి తెలివితో వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు సభాపతిని అవమానించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అనిత కోరారు.












Click it and Unblock the Notifications