టి: చనిపోయినట్లుగా నన్నపనేని, జగన్‌తో పొత్తుపై కిషన్

శాసన మండలిలో రాజకుమారి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ... రాష్ట్రం విడిపోవడాన్ని తట్టుకోలేక చనిపోయినట్లు నటించి నిరసన తెలిపారు. కాగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనమండలి సభ్యులు నర్సారెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన ఆపాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. వెంటనే బిల్లును ప్రవేశ పెట్టాలన్నారు. మరోవైపు తెరాస శాసనమండలి సభ్యుల మండలి చైర్మన్ చక్రపాణిని కలిసి తక్షణమే బిల్లుపై చర్చ పెట్టాలని కోరారు.
జగన్‌తో పొత్తు ఉండదు: కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో అన్నారు. జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అవినీతి విషయంలో జాతీయస్థాయిలో తమపై ప్రభావం పడుతుందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ప్రాంతానికే పరిమితమవుతుందన్నారు. రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడా లేదన్నారు. విభఝన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతాయని, పొత్తు విషయం అప్పుడే తేలుతుందన్నారు.












Click it and Unblock the Notifications