అలా అన్నవారిని ఉరితీయాలి: నన్నపనేని సంచలనం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కొన్ని ఆలయాలలోకి వెళ్లడం వల్లే కేరళలో వరదలు వచ్చాయంటూ కొందరు కామెంట్లు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

అలా అన్నవాళ్లను ఉరి తీయాలని నన్నపనేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గురువారం నన్నపనేని నెల్లూరులో మాట్లాడుతూ.. ఈ జిల్లా జైలులో మహిళా ఖైదీలు ఎక్కువగా వున్నారని అన్నారు.

 nannapaneni rajakumari fires at tv serials and sabarimala issue

మహిళల్లో హింసను ప్రేరేపించేవిగా నేటి సీరియల్స్ ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్స్ చూసి మహిళలు కోపోద్రేకాలకు గురవుతూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. టీవీ సీరియల్స్‌ని బ్యాన్ చేయాలని నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవలి కేరళ వరదలకు మహిళలను శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అనుమతించడమే కారణమని కొందరు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకుమారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+