ఎవరి డబ్బు తీసుకునేందుకు వారు లెక్కలు చెప్పాలా?: మోడీకి నన్నపనేని ఝలక్

ఎవరి డబ్బు వారు తీసుకునేందుకు లెక్కలు చూపించాలని చెప్పడం ఏమిటని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్నటి దాకా (గురువారం)

విజయవాడ: ఎవరి డబ్బు వారు తీసుకునేందుకు లెక్కలు చూపించాలని చెప్పడం ఏమిటని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్నటి దాకా (గురువారం) నోట్ల మార్పిడి, ఇప్పుడు డిపాజిట్ల కోసం జనాలు క్యూల కడుతున్న విషయం తెలిసిందే.

నోట్ల మార్పిడికి, పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు లెక్కలు చూపించాలని కేంద్రం చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు పెరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా మోడీ నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు.

Nannapaneni Rajakumari interesting comments on demonetisation

ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్, టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దేశ ప్రజలంతా 18 రోజులుగా చిల్లర దొరకక కష్టాలు పడుతున్నారన్్నారు.

పెళ్లిళ్లకు ఆంక్షలు లేకుండా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరి డబ్బు వారు తీసుకునేందుకు లెక్కలు చూపించాలనడం సరికాదన్నారు. తాను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా సూచిస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+