Nara Bhuvaneswari : టీడీపీ క్యాడర్ కేసులకు భయపడొద్దు-కలిసే ఎదుర్కొందామన్న భువనేశ్వరి...
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరార్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ఇవాళ కూడా కొనసాగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండల పరిధిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి భువనేశ్వరి పరామర్శించారు. తంగెళ్లపాలెంనకు చెందిన మోడెం వెంకటరమణ, కొనతనేరికి చెందిన గాలి సుధాకర్, కాసరంనకు చెందిన పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబాల్ని పరామర్శించి తలో 3 లక్షల చొప్పు సాయం అందించారు.
అనంతరం సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన సభలో భువనేశ్వరి మాట్లాడారు. ఎప్పుడూ కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లే వాళ్లం, ఈసారి ఒక్కదాన్నే వెళ్లాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబును నిర్బందించి 48 రోజులైందని, మనవడు దేవాన్ష్ ను చూసి కూడా 48 రోజులైందన్నారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు కూడా తిరుమలను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రతీ జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా చేయాలని చంద్రబాబు అనుకున్నారని తెలిపారు.

అనంతపురంలో కియా, తిరుపతిలో హార్డ్ వేర్ కంపెనీలు తెచ్చారని, ఇప్పుడు అవన్నీ ఎక్కడకు పోయాయని భువనేశ్వరి ప్రశ్నించారు. అవన్నీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వారికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. మనకు రావాల్సిన ఉద్యోగాలు ఇతర రాష్ట్రాలకు పోతున్నాయనేదే తన బాధ అన్నారు. 30 ఏళ్లుగా నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్ధను ఇబ్బందులు పెడితే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు.
తాను కూడా హెరిటేజ్ సంస్ధ ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో నడుపుతున్నానని, అక్కడి ప్రభుత్వాలు ఎంతో సహకరిస్తున్నాయన్నారు. వాళ్లు ఏనాడో మమ్మల్ని హింస, భయపెట్టలేదన్నారు.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐఎస్బీ సంస్దను తెచ్చారు, ప్రభుత్వానికి కోటాలో ఒక్క సీటు కూడా ఇవ్వమని చెప్పినా అంగీకరించడంతో హైదరాబాద్ లో పెట్టారన్నారు. నాలుగేళ్లలో తిరుపతిలో ఏ ఒక్క సంస్ధ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు.

ఎస్వీ వర్శిటీలో విద్యార్ధి నేతగా చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారని, ఇప్పుడు టీడీపీ, జనసేన నేతల్ని ప్రభుత్వం పోలీసుల సాయంతో ఇబ్బందులు పెడుతోందని భువనేశ్వరి ఆరోపించారు. ఏపీలో గొప్పతనం అరెస్టులు, కేసులు, హింస మాత్రమేనన్నారు. అరెస్టు తర్వాత తన కోసం చనిపోయిన వారి కుటుంబాల్ని పరామర్శించి ధైర్యం చెప్పమని చంద్రబాబు తనకు చెప్పారన్నారు. మనలో ఎన్టీఆర్ పౌరుషం,చంద్రబాబు క్రమశిక్షణ ఉంది. కాబట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడదామని, అక్రమ కేసుల్ని ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications