భువనేశ్వరి గేమ్ ఛేంజర్ అయ్యేనా - ఆ ఇద్దరినీ అధిగమిస్తారా..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో ఇప్పుడు సానుభూతిని తమకు అనుకూలగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. తాజాగా న్యాయస్థానాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో నవంబర్ 8 తరువాతనే చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే చంద్రబాబు సతీమణి ప్రజల్లోకి వచ్చేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. దీంతో, ఇప్పుడు నాడు విజయమ్మ..షర్మిల చేసిన యాత్రతో పోల్చటం మొదలైంది.
చంద్రబాబు అరెస్ట్ తో : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 40 రోజులు అవుతోంది. ఎప్పుడు బయటకు వస్తారనేది ఇంకా తేలటం లేదు. న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు కేసుల విచారణ జరుగుతోంది. క్వాష్ పిటీషన్ పైన తీర్పును వచ్చే నెల నవంబర్ 8న వెల్లడిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో, ఆ తరువాతనే చంద్రబాబుకు రిలీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ సమయంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీలో నైరాశ్యం కనిపిస్తోంది. దీంతో నేరుగా భువనేశ్వరిని రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నిజం గెలవాలి పేరుతో యాత్రకు భువనేశ్వరి సిద్దమయ్యారు. చంద్రబాబు విడుదల తరువాతనే లోకేశ్ తన యువగళం యాత్రను కొనసాగించనున్నారు. భువనేశ్వరి యాత్ర..పార్టీ కార్యాచరణ పై రేపు (21న) లోకేశ్ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
ప్రజల్లోకి భువనేశ్వరి : అటు వైసీపీ ఎన్నికల కార్యాచరణతో పథకాల అమలుతో ప్రజల్లోకి వెళ్లేందుకు షెడ్యూల్ సిద్దం చేసుకుంది. దీంతో, భువనేశ్వరిని ప్రజల మధ్యకు పంపటం ద్వారా రాజకీయంగా పై చేయి సాధించాలనేది టీడీపీ వ్యూహం. దసరా తరువాత ఈ యాత్ర ప్రారంభిచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాత.. పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ తో నిలిచిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి యాత్రలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 21న ఖరారయ్యే అవకాశం ఉంది.

రాజకీయంగా కలిసొచ్చేనా : చంద్రబాబు అరెస్ట్.. ఎప్పుడూ రాజకీయంగా బయటకు రాని భువనేశ్వరి ప్రజల మధ్యకు రావటం ద్వారా పార్టీకి ఎన్నికల ముందు మేలు జరుగుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఏర్పాటు తరువాత జగన్ ఓదార్పు యాత్ర చేస్తూ అరెస్ట్ అయిన సమయంలో..నాడు విజయమ్మ, షర్మిల ప్రజల మద్యకు వచ్చారు. నాడు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.
జగన్ బయటకు వచ్చే వరకూ ఆ ఇద్దరూ ప్రజల మధ్యనే ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వరి సైతం అదే తరహాలో ప్రజలను ఆకర్షించగలుగుతారా.. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి పార్టీకి ప్రయోజన కరంగా మార్చగలుగుతారా అనే రాజకీయ చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా భువనేశ్వరి చేసే యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications