దత్తత గ్రామంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో పర్యటించారు. కొమరవోలు గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భువనేశ్వరి గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

దేవాన్ష్ అన్నప్రాసన
ఆదివారం తిరుమలలో తన మనమడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌కు బయల్దేరి రానున్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను, సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి అమరావతి శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానపత్రాన్ని చంద్రబాబు అందజేయనున్నారు.
‘నా ఇటుక-నా అమరావతికి' విశేష స్పందన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఏర్పాటు చేసిన ‘నా ఇటుక-నా అమరావతి' వెబ్‌సైట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. నెటిజన్లు శనివారం నాటికి 11.65లక్షల ఈ బ్రిక్స్ కొనుగోలు చేశారు. ఈ వెబ్‌సైట్‌ను ఏపి ప్రభుత్వం గురువారం ప్రారంభించింది.












Click it and Unblock the Notifications