అలాంటి కంపెనీల కొనుగోలు, దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం: బ్రాహ్మణి
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తమ వ్యాపార విస్తరణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తమ వ్యాపార విస్తరణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సొంత వ్యాపార విస్తరణ, అనుకూలంగా ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే డెయిరీ విభాగంలో దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ఇటీవలే రిలయన్స్ రిటైల్‌కు చెందిన డెయిరీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

లక్ష్యాలను చేరుతోంది..
2022 నాటికి రూ.6,000 కోట్ల ఆదాయ స్థాయికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 25 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తేనే ఈ లక్ష్యానికి కంపెనీ చేరుతుందని వార్షిక నివేదికలో బ్రాహ్మణి తెలిపారు.
మొత్తం ఆదాయంలో విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయ వాటాను 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు.
Recommended Video


అవకాశాలు వదులుకోం..
తమ కార్యకలాపాలను మరింత స్థిరీకరించుకునే ప్రక్రియను కొనసాగించడమే కాదు.. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో తమకు అనుకూలంగా ఉండే వ్యాపారాల కొనుగోళ్ల అవకాశాలను అందిపుచ్చుకుంటామని బ్రాహ్మణి స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం..
సొంతంగా, కొనుగోళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మరింత గరిష్ఠంగా సామర్థ్యాల వినియోగంపై దృష్టి పెడతామని, విలువ చేర్చిన ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవడానికి కొత్త శ్రేణి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నామని బ్రాహ్మణి వివరించారు.

లాభాలు ఆశా జనకం..
కాగా, హెరిటేజ్.. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,642.9 కోట్ల ఆదాయంపై రూ.66.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత నాలుగేళ్ల కాలంలో కంపెనీ వార్షిక సగటు ఆదాయ వృద్ధి రేటు 13.34 శాతం ఉంది. 2016-17 నాటికి కంపెనీ నికర విలువ (నెట్‌వర్త్) రూ.300 కోట్లు. నిల్వలు (రిజర్వులు) రూ.277 కోట్లకు చేరాయి. షేరుకు ఆర్జన (ఈపీఎస్) 2015-16లో రూ.23.89 ఉండగా.. గత ఆర్థిక సంవత్సరానికి రూ.28.80కు చేరింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications