రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
అమరావతి: ఇంధన పొదుపులో హెరిటేజ్ సంస్థకు రెండోసారి అవార్డు వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన ఆదా సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఇంధన పొదుపులో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ ఇంధన ఆదా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తదితరులు విచ్చేశారు.
అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్రమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. హెరిటేజ్ సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... ఈ అవార్డు అందుకోవడం గర్వకారణమని అన్నారు. హెరిటేజ్ సంస్థకు పదేళ్లలో 8 సార్లు అవార్డు దక్కిందని చెప్పారు. హెరిటేజ్ టీమ్ కష్టపడి పనిచేయడంతోనే ఈ అవార్డు వచ్చిందని, తమ సంస్థ పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టిందని తెలిపారు. తాము ఎలక్ట్రికల్ సేవింగ్స్ ను 14.5% తగ్గించగలిగామని వివరించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications