టీవీ9 ప్రశ్నకు నారా బ్రాహ్మణి సూపర్ ఆన్సర్: బాబు, లోకేష్‌పై ఇలా..
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలుగానే కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నారా బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు.
Recommended Video

హైదరాబాద్: ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలుగానే కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నారా బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకున్న నాయకత్వ లక్షణాలతో ఆ రంగంలో దూసుకుపోతున్నారు.
తాజాగా, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో ఆమె హెరిటేజ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ9 ప్రతినిధి ఆమెను పలకరించారు. 'హైదరాబాద్‌లో జరుగుతోంది కదా ఈ సదస్సు... మీకు ఏమనిపిస్తోంది' అని బ్రాహ్మణిని అడిగారు. నారా బ్రాహ్మణి నుంచి ఎలాంటి సమాధానం రాబట్టాలని టీవీ9 ఈ ప్రశ్న అడిగిందో గానీ.. ఆమె మాత్రం సరైన జవాబిచ్చారు.

ఎక్కడనేది ముఖ్యం కాదు..
‘ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం అనేది మనకి ఎంతో గర్వకారణం. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది అనేది ప్రధానం కానేకాదు. అలాగైతే దేశంలోనే మహిళా సాధికారితకు సంబంధించి అతి పెద్ద మహిళా పార్లమెంటు సదస్సు గత సంవత్సరం ఏపీలోనే జరిగింది' అని బ్రాహ్మణి జవాబిచ్చారు.

అదే ముఖ్యం
అంతేగాక, ‘సదస్సు ఎక్కడా అనేది ముఖ్యం కాదు. ఏం చర్చించాం. ఎంత ఉపయోగించుకున్నాం. ఆ చర్చల నుంచి ఎంత స్వీకరించాం అనేదే ముఖ్యం. మహిళా ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ గురించి ఇక్కడ జరిగే చర్చలు ఎంతో ఉపయోగపడతాయి' అని బ్రాహ్మణి టీవీ9కి వివరించారు.

ఎన్నో అవకాశాలు..
‘అమెరికా ప్రతినిధులతో కలిసి ఇక్కడ పాల్గొనడం.. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరం. అన్ని రంగాల్లో భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎన్నో అవకాశాలున్నాయి' అని బ్రాహ్మణి తెలిపారు.

మహిళను బట్టే ఇల్లు..
‘మహిళా అభ్యుదయం అనేది మహిళతోనే సాధ్యం అనే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం ఆచరణాత్మకంగా ఉంది అంతెందుకు మన కుటుంబంలో కూడా ఇంట్లో మహిళని బట్టే ఇళ్లు బాగుంటుంది' అని బ్రాహ్మణి వివరించారు.

చంద్రబాబు, లోకేష్ వల్లే..
‘తన మామ చంద్రబాబునాయుడు, భర్త నారా లోకేష్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అందుకే హేరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నా' అని బ్రాహ్మణి తెలిపారు. నారా బ్రాహ్మణి.. సింగపూర్, అమెరికా దేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానే కాకుండా, ఎన్టీఆర్ ట్రస్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాగా, సదస్సుకు హాజరైన బ్రాహ్మణితో పలువురు మహిళా ఔత్సాహికులు ఫొటోలు దిగారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications