'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!!
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన తల్లికి వందనం అమలు విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గత ఏడాది విద్య సంవత్సరం ప్రారంభం వేళ అర్హులైన విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. మరోసారి వచ్చే జూన్ లో నిధులు జమ చేయాల్సి ఉంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వారితో పాటుగా కొత్త ఎవరికి అవకాశం దక్కేదీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అర్హులందరికీ సాయం అందించాల నేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని వెల్లడించారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాం. 67,01,653 మందికి తల్లికి వందనం అమలు చేసామని చెప్పారు యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. యూడైస్ లో నమోదైన వారిలో అర్హులందరికీ(84.27%) సాయం అందించామని మంత్రి స్పష్టత ఇచ్చారు. వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అంటే 52శాతం మందికి మాత్రమే ఇచ్చారని వివరించారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ అమలు
తాము 85శాతం మందికి సాయం అందించామని... 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారని వెల్లడించారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారన్నారు. 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయంగా వెల్లడించారు. కాగా, కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేం ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా అందిస్తున్నామని... గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా.. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
-
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications