నారా లోకేష్‌కు వేదపండితుల ఆశీర్వాదం (ఫోటో)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చారు.
కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తొలి పుట్టిన రోజు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ సీనియర్ నేత రవిచంద్రయ్య యాదవ్, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పోటీపడ్డారు.

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షులు, టీడీపీ ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేమూరి ఆనంద్ సూర్య ఆధ్వర్యంలో వేదపండితులు ఆశీర్వదించారు. శృంగేరి శంకరమఠం పండితులు స్మార్త భట్టారక, పురోహిత సార్వభౌమ శ్రీ నిమ్మకండి శ్రీనివాసశర్మ గారు తదితరులు లోకష్‌ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
దేశ ప్రజల్లో స్పూర్తి నింపిన మహానేత సుభాష్ చంద్రబోస్ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విశాఖలో అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. బీచ్‌రోడ్డులోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తిరుపతి ఎన్నికలకు సుగుణమ్మ నామినేషన్
తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా చదలవాడ సుగుణమ్మ శుక్రవారం తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వెంకటరమణ మృతితో ఏ్పడిన ఖాళీతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అన్ని పార్టీలు సహకరించాలని సుగుణమ్మ కోరారు.


Click it and Unblock the Notifications