అభ్యర్థులే దొరుకొద్దు: ప్రత్యర్థి పార్టీలపై నారా లోకేష్
చిత్తూరు: వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులు సైతం కరువయ్యేలా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని తెలుగుదేశం సంక్షేమ విభాగం సమన్వయకర్త నారా లోకేష్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన తిరుపతి నుంచీ వేలూరు వెళుతూ మార్గమధ్యంలోని గుడిపాలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కొద్దిసేపు గడిపారు. తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో మరింత పటి ష్టం చేయాలని కోరారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.
కార్యకర్తల సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమన్నారు. కార్యకర్తల జీవితాలకు, భవిష్యత్తుకూ తనదీ భరోసా అని అభయమిచ్చారు. అనారోగ్యంతో వేలూరు సీఎంసీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత గురజాల మహదేవనాయుడును పరామర్శించిన లోకేష్ అనంతరం అక్కడే ఆయన కుటుంబ సభ్యులతో సుమారు అరగంట గడిపారు.

తర్వాత వైద్యశా ల డైరెక్టర్, ఇతర ముఖ్య వైద్యులతో కలసి మహదేవనాయుడు ఆరోగ్యపరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. తర్వా త చిత్తూరు మీదుగా స్వగ్రామమైన నారావారిపల్లె వెళ్ళా రు. ఆయనతో కలసి వచ్చిన తల్లి భువనేశ్వరి విమానాశ్రయం నుంచి నేరుగా నారావారి పల్లె వెళ్లిపోయారు.
హైదరాబాదు నుంచీ జిల్లాకు వచ్చిన లోకే్‌షకు తిరుపతి విమానాశ్రయం మొదలుకుని వేలూరు వరకూ మార్గమధ్యంలో అడుగడుగునా పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థుల నుంచీ ఘన స్వాగతం లభించింది. చిత్తూరు నగర శివార్లలో మేయర్ కటారి అనురాధ, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, నగర పార్టీ అధ్యక్షుడు మాపాక్షి మోహన్, ముఖ్యనేతలు కటారి మోహన్, అత్తు, వైవీ రాజేశ్వరి, పెద్ద సంఖ్య లో కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు అట్టహాసంగా స్వాగతం పలికారు.
వేలూరు సీఎంసీ వైద్యశాల వద్ద వేలూరు ఎమ్మెల్యే కలై అరసు అనుచరులతో కలసి లోకే్‌షను ఘనంగా స్వాగతించారు. తన పీఏ విజయ్ పెళ్లికి హాజరయ్యేందుకు లోకేష్ తన తల్లి భువనేశ్వరితో కలసి తిరుమల వెళ్లారు.












Click it and Unblock the Notifications