వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగపేపర్లు, దొంగ చానెళ్లు నడపడం లేదు: జగన్‌పై నారా లోకేష్ విసుర్లు

తనపై లోక్యాష్ అంటూ వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. దమ్ముంటే 24 గంటల్లో నిరూపించాలని ఆయన అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాను దొంగబ్బాయిని కానని, దొంగ పేపర్లు, దొంగ చానల్స్‌ను నడపడం లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం తన విశాఖపర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు.

తాతలాగా, నాన్నలాగా తాను మంచిపేరు తెచ్చుకోలేకపోవచ్చు గానీ పార్టీకి మాత్రం చెడ్డపేరు తీసుకురానని లోకేష్ అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, త్వరలోనే మిగతా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామస్థాయిలో పార్టీ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తల సూచన మేరకే నియామకాలు ఉంటాయని లోకేష్ తెలిపారు.

లోక్యాష్ అంటూ తనపై దుమ్మెత్తిపోసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రతిస్పందించారు. లోకేష్‌.. లోక్యాష్‌ అని పలువురు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే 24 గంటల్లో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

నిరూపించలేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చానని, సంపాదించుకోవడానికి కాదని అన్నారు. రానున్న రెండేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్‌ తెలిపారు.

Nara Lokesh

అల్లుమియపాలెంలోని శ్రీపతిరాజు గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఆతిథ్యం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో పారిశ్రామిక రంగంలో ఐదు లక్షలు, ఐటీ రంగంలో లక్ష మొత్తం ఆరు లక్షలు ఉద్యోగులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల రూపరేఖలు త్వరలోనే పూర్తిగా మార్చివేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు రూ.30 వేల కోట్ల నిధులు నారా లోకేష్ చెప్పారు. ఆ నిధులతో రహదారులు, వర్మీ కంపోస్టులు, తాగునీటి సౌకర్యాలకు ఖర్చు చేస్తామని ఆయన వివరించారు.

English summary
Andhra Pradesh minister and CM Nara Chandrababu Naidu's son Nara Lokesh challenged YSR Congress party president YS Jagan on later's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X