కేటీఆర్ తో సమావేశం, జూబ్లీహిల్స్ లో పోటీ పై తేల్చేసిన లోకేష్ - కీలక మలుపు..!!
ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పైన కొంత కాలంగా జరుగుతున్న చర్చ వేళ స్పష్టత ఇచ్చారు. అదే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ ని కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారం పైన క్లారిటీ ఇచ్చేసారు. ప్రధానితో మోదీతో జరిగిన భేటీలో చేసిన సూచనలు.. అమరావతి నిర్మాణంలో తమ ప్రణాళికల గురంచి లోకేష్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసారు.
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక అంశాల పైన స్పందించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరి కంటే ప్రధాని మోదీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ప్రధానితో ఇటీవలి భేటీలో తానేమీ ప్రత్యేకంగా వైసీపీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. రాజకీయంగా, అభివృద్ధిపరంగా ప్రధాని తనకు సలహాలిచ్చారని చెప్పారు.

రాష్ట్రంలో కూటమి పాలనలో గంజాయి సాగు భారీగా తగ్గిందని చెప్పారు. 100 శాతం నిర్మూలించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. నక్సలిజం దాదాపు అంతిమ దశకు చేరుకుందన్నారు.
లిక్కర్ స్కాంకు సంబంధించి వైసీపీలో ఏ ఒక్కరూ కూడా అవినీతి జరగలేదని చెప్పడం లేదని.. ఆ పార్టీ ఈ కుంభకోణంలో అడ్డంగా దొరికిందని చెప్పుకొచ్చారు. 2029 లోనూ ఎన్డీఏకు మద్దతు ఇస్తామని లోకేష్ స్పష్టం చేసారు.
కేటీఆర్ తో తరచూ సమావేశాలు జరుగుతున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన లోకేష్ స్పందించారు. ఈ విషయం పై ఆయన్నే అడగాలని సూచించారు. తాను అందరినీ కలుస్తాను.. ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు. తాను ఎవరినైనా కలవాలంటే పక్క రాష్ట్ర సీఎం అనుమతి తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీకి కార్యకర్తల బలం ఉందని చెప్పారు. మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదని లోకేష్ తేల్చి చెప్పారు.
అక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు. దీని ద్వారా ఎన్డీఏ లో భాగస్వామిగా ఉండటంతో టీడీపీ ఇక్కడ బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధుల పైన ఒక స్పష్టత వచ్చింది. బీజేపీ అభ్యర్ధి పైన క్లారిటీ రావాల్సి ఉంది. 2014 లో ఇక్కడ గోపీనాథ్ టీడీపీ నుంచే విజయం సాధించారు. దీంతో.. ఇప్పుడు టీడీపీ నిర్ణయం ఈ ఉప ఎన్నికలో కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications