జగన్‌కి లాలూ గతే, దొంగపుత్రుడిని నమ్ముకుంది: లోకేష్

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన బుధవారం మరోసారి మండిపడ్డారు. ఆర్జెడి అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గతే వైయస్ జగన్‌కు పడుతుందన్నారు.

అధికార కాంగ్రెసు పార్టీ దొంగపుత్రుడు, దత్తపుత్రుడిని నమ్ముకుందని ఎద్దేవా చేశారు. యువత తలుచుకుంటే ప్రభంజనం ఖాయమన్నారు. అవినీతిపరులను తరిమి కొట్టాలని యువతకు సూచించారు. తాను ప్రతి కళాశాలకు వెళ్లి యువతలో చైతన్యం తీసుకు వస్తానని చెప్పారు.

Nara Lokesh

నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్(టిఎన్ఎస్ఎఫ్) కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

కాగా, అంతకుముందు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిత్తూరు జిల్లా తిరుపతికి వచ్చిన నారా లోకేష్‌కు తిరుపతి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చిన స్వాగతించారు. తిరుపతికి వచ్చే దారిలో శంకరంబాడి కూడలి వద్ద తెలుగుదేశం కార్యకర్తలతో కరచాలనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+