నాడు తగ్గేదేలే... నేడు చెప్పేదేలే; పోలవరానికి శాపం వైసిపి ప్రభుత్వం: నారా లోకేష్ ఫైర్
పోలవరం ముంపు మండలాలలో గోదావరి వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గోదావరి వరదల వల్ల చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాలలోని పదుల సంఖ్యలో గ్రామాలు నీటమునిగాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పరిధిలోనూ ప్రజలు గోదావరి వరదతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గోదావరి వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ముంపు గ్రామాల ప్రజలకు కనీస సహాయం అందడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి.
పోలవరం ముంపు గ్రామాల ప్రజలని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం ఇంత ప్రకృతి విపత్తు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పోలవరం నిర్మాణం, పునరావాసం కల్పించడానికి నిర్వాసితులకు హామీ ఇచ్చిన విధంగా ప్యాకేజీ ఇవ్వడం విషయంలో కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మోహన్ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు అని విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. పోలవరానికి పట్టిన శాపం వైసిపి ప్రభుత్వం. ఇకనైనా మంగళవారం కబుర్లు మాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చిత్తశుద్దితో పూర్తి చేయాలి. నిర్వాసితులకు హామీ ఇచ్చిన విధంగా ప్యాకేజీ అందించాలి.#JaganPaniAyipoyindhi pic.twitter.com/5lgwwOhSLj
— Lokesh Nara (@naralokesh) July 20, 2022
జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు గడప దాటవు అంటూ పేర్కొన్నారు నారా లోకేష్. పోలవరానికి పట్టిన శాపం వైసిపి ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు. ఇకనైనా మంగళవారం కబుర్లు మాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చిత్తశుద్దితో పూర్తి చేయాలి అని లోకేష్ సూచించారు. నిర్వాసితులకు హామీ ఇచ్చిన విధంగా ప్యాకేజీ అందించాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు.

100 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు... వరద సాయంగా మాకిచ్చింది ఇవే అంటూ పోలవరం ముంపు గ్రామం చట్టిలోని కొందరు ప్రజలు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు లోకేష్. ఇక అంతే కాదు పోలవరం విషయంలో నాడు తగ్గేదే లే.. నేను చెప్పేదే లే అంటూ సెటైర్లు వేసిన నారా లోకేష్ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అంటూ అంబటి రాంబాబు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ పని అయిపోయింది అంటూ లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications