Nara Lokesh: లోకేష్ కు ఆపిల్ హ్యకింగ్ అలర్ట్.. ! ఈసీకి టీడీపీ ఫిర్యాదు..
ఏపీలో ఎన్నికల వేళ మరోసారి ట్యాపింగ్ కలకలం రేపుతోంది. అధికార వైసీపీ తమ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తుండగా.. ఇప్పుడు వీటికి సంబంధించి ఓ ఆధారం బయటికి వచ్చింది. టీడీపీ నేత నారా లోకేష్ కు యాపిల్ పంపిన సెక్యూరిటీ అలర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీన్ని ఆధారంగా చూపుతూ ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.
నారా లోకేష్ ఫోన్ ట్యాప్ అవుతోందని, హ్యాక్ కూడా అవుతోందని యాపిల్ సంస్ధ ఆయనకు సెక్యూరిటీ అలర్ట్ పంపింది. ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని ఆపిల్ నుంచి లోకేష్ కు ఈమెయిల్ అందింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్‍కు ఇందులో యాపిల్ సంస్ధ సూచించింది. దీంతో లోకేష్ అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు ఈసీని ఆశ్రయించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను కొందరు ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్ర కుమార్ లేఖ రాశారు. గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఐ పోన్ మెసేజ్ లు వచ్చాయని ఫిర్యాదులో తెలిపారు. ఇలాంటి సందేశాలే లోకేష్ కు 2024 మార్చిలో సైతం వచ్చాయన్నారు. డీజీపీ రాజేంధ్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్‌ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేకమార్లు ఈసీ దృష్టికి తెచ్చినట్లు గుర్తుచేశారు.
రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కనకకమేడల తెలిపారు. గత రెండేళ్లుగా ఇంఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని కూడా ఇందులో పేర్కొన్నారు. పి.ఎస్.ఆర్ ఆంజనేయులు అధికారపార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని, సాధారణ ఎన్నికల నేపధ్యంలో అధికారపార్టీకి అనుంగులుగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కోరారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications