ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్ (ఫోటోలు)

అమరావతి: ‘తాతలు.. తండ్రుల పేర్లు చెప్పుకుని బతకటం కాదు, వారి స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలి' అని టీడీపీ యువనేత నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో టిడిపి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

దొంగబ్బాయి అంటూ జగన్‌ని, మా అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతున్న జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆరు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అలాగే మరి కొన్ని నదులను అనుసంధానం చేసి కరవురహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి రాజధాని నిర్మాణానికి, ప్రాజెక్టుల ఏర్పాటుకు అడుగడుగునా అడ్డు తగులు తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అక్టోబర్‌లో రాజధానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు.

నేటి యువత అబ్దుల్‌కలామ్, ఎన్‌టిఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పాఠశాల స్థాపించి కష్టాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల పిల్లలకు ఉచితవిద్య అందిస్తున్నామని చెప్పారు. బాలకృష్ణ క్యాన్సర్‌ హాస్పటల్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

రాష్ట్రంలో 134 మందికి ఈవిధంగా సహాయం చేశామని తెలిపారు. జగన్‌లాగా వేలకోట్లు దొంగ డబ్బు సంపాదించాలని లేదని, అలాంటి తప్పుడు పనులు చేయబోమని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దొంగడబ్బు వెనకేసి ఆ డబ్బుతో పత్రిక, టీవీ చానల్‌ పెట్టాలన్న ఆలోచనలు తమకు లేవని చెప్పారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని, రైతును చూసి కరవు భయపడాలే తప్ప రైతు కరవును చూసి భయపడకుండా చూస్తామన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసోపేతమైన చర్యల్లో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, కార్యకర్తల కుటుంబ సంక్షేమం కోసం 2లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్న ఘనత టిడిపికే దక్కుతుందన్నారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఇప్పటి వరకు 124 కుటుంబాలకు టిడిపి సాయం అందించిందన్నారు. 2012 ఉప ఎన్నికల్లో టిడిపికి ఒక్కసీటు కూడా రాకపోవడంతో నాయకులు భయపడి పార్టీని వీడినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్‌టిఆర్ భరోసా కింద 200 నుంచి 1000 రూపాయల వరకు ఐదు రెట్లు పెంచడమే కాకుండా 30వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

పక్క రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 50వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఇప్పటికే హీరోమోటార్, మేకిన్ ఆంధ్ర వంటి సంస్థలు ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

టిడిపి కార్యకర్తలు, నాయకులు, పట్టణ, మండల, వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామస్థాయిలో నాయకుడు ఏవిధంగా ఉండాలో, సమస్యలను పరిష్కరించుకునే విధానంపై ఈ శిక్షణా తరగతుల్లో వివరించనున్నట్లు, కావున ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

అనంతరం టిడిపి సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ 1956 నుంచి మా తాతలు, తండ్రులు ఏపిని అభివృద్ధిలోకి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం కేసిఆర్ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. టిడిపిలో క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల నేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్నారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తితో రోజుకు 22గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నారు.

 ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

ఎన్టీఆర్ ఆదర్శం, జగన్‌‌ దొంగబ్బాయి: అక్క అంటూనే షర్మిలపై విమర్శలు చేసిన లోకేశ్

జడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ లోకేష్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జె పుష్పరాజ్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, డిబివి స్వామి, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, విజయ్‌కుమార్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి అరుణకుమారి, ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు పోతుల సునీత, జిల్లా డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కంచర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+