1978-2017: కరణం-లోకే‌ష్‌లపై పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలోని తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నప్పుడు శాసనమండలిపై చర్చ వచ్చింది.

శాసనమండలి అంటేనే తలపండిన సీనియర్‌ నాయకులు వెళ్లే సభ అన్న అభిప్రాయం ఇన్నాళ్లూ ఉంది. అంతేగాక, దీన్ని పెద్దల సభ అని కూడా వ్యవహరిస్తుంటారు. కానీ, ఇప్పుడు పెద్దల సభలోకి యువకులూ అడుగుపెడుతున్నారన్న అంశంపై సోమవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది.

nara lokesh and karanam balaram will enter soon in Legislative Council

శాసనసభ ఆవరణలోని తెదేపా శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత కరణం బలరాం, పయ్యావుల కేశవ్‌ తదితరులు ఉన్నప్పుడు ఈ చర్చ చోటు చేసుకుంది.
కాగా, కరణం బలరాం 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇటీవలే శాసనమండలికి ఎన్నికైన ఆయన మార్చి 30న సభలో అడుగుపెడుతున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికై, సభలో అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్సీగా ఆయన రాజకీయ ప్రస్థానం 2017లో మొదలవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1978 బ్యాచ్‌ మొదలుకుని 2017 బ్యాచ్‌ నాయకుల వరకు సభ్యులుగా ఉన్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leader Payyavula keshav on Friday said that Nara Lokesh and Karanam Balaram will enter soon in Legislative Council.
Please Wait while comments are loading...