ఐటి ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు(పిక్చర్స్)
న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి అద్భుత అవకాశాలున్నాయని తెలుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ పలువురు ఐటి ప్రముఖులతో సమావేశమయ్యారు. అమెరికాలో లోకేష్ నాలుగోరోజు పర్యటన వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ విడుదల చేశారు.
సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు నెట్‌వర్క్ సౌకర్యాలను మరింత మెరుగ్గా చేసుకోవడం ద్వారా ఏపిని అభివృద్ది చేయాలన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా ఐటి ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు జరిపారు.

పారిశ్రామికవేత్తలతో లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి అద్భుత అవకాశాలున్నాయని తెలుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు.

పారిశ్రామికవేత్తలతో లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ పలువురు ఐటి ప్రముఖులతో సమావేశమయ్యారు.

పారిశ్రామికవేత్తలతో లోకేష్
అమెరికాలో లోకేష్ నాలుగోరోజు పర్యటన వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ విడుదల చేశారు.

పారిశ్రామికవేత్తలతో లోకేష్
సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు నెట్‌వర్క్ సౌకర్యాలను మరింత మెరుగ్గా చేసుకోవడం ద్వారా ఏపిని అభివృద్ది చేయాలన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా ఐటి ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు జరిపారు.
నెట్ వర్క్ రంగంలో పేరుపొందిన సిటీఓ ప్రదీప్ సింధుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్ రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫైబర్ గ్రిడ్ విశేషాలను, ప్రతి ఇంటికి 15 ఎంబిపిఎస్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్న చంద్రబాబు ఆశయాన్ని వివరించారని తెలిపారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ విజయగద్దెను కలిసి ఏపిలో డిజిటల్ రంగంలో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను వివరించారు.
అనంతరం అరుబ నెట్ వర్క్ సిఈఓ కీర్తి మెల్కొటేను కలిసి సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ కు సహాయం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇన్ఫోసిస్ సిఈఓ విశాల్ సిక్కాతో సమాశమై విశాఖపట్నంలో డెవలప్ సెంటర్ పనుల అంశంపై చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications