పెట్టుబడులతో: టెక్నాస్ గవర్నర్‌తో లోకేశ్(ఫోటోలు)
హైదరాబాద్: పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని టీడీపీ యువనేత, ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌ను కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 'స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు' కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేసేందుకు గాను అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
బుధవారం ఉదయం టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌తో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తూనే, పరిపాలన, పాదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలను వివరించారు.

టెక్సాస్ గవర్నర్‌తో లోకేశ్ భేటీ
ఏపీలో పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే మంజూరు చేస్తున్నామని, పరిశ్రమలకు నిరంతర విద్యుత్, ఇతర వనరులను కల్పిస్తున్నామని చెప్పారు.

టెక్సాస్ గవర్నర్‌తో లోకేశ్ భేటీ
వ్యాపారం చేసేందుకు ఏపీలో అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ఉందని ఆయనకి వివరించారు.

టెక్సాస్ గవర్నర్‌తో లోకేశ్ భేటీ
ఈ విషయంలో గవర్నర్ అబాట్ నుంచి మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.

టెక్సాస్ గవర్నర్‌తో లోకేశ్ భేటీ
ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంపై గవర్నర్ గ్రెగ్ అబాట్ త్వరలో ఓ బృందాన్ని ఏపీకి పంపుతామని హామి ఇచ్చినట్లు లోకేష్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications