దొంగబ్బాయ్: జగన్‌కు లోకేష్ ప్రశ్న, బాబు నమస్కారం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం మహానాడు రెండో రోజు కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై స్పందించారు. వేదిక పైకి వచ్చిన లోకేష్... తెలుగు జాతిలో ఏకైక నాయకుడు చంద్రబాబు అంటూ నమస్కరించారు. చంద్రబాబు ప్రతినమస్కారం చేశారు.
తనకు లోకేష్ అని పేరు పెట్టి దీవించిన తాతగారికి నీరాజనాలు అన్నారు. ముప్పై మూడేళ్లుగా ఎత్తిన పసుపు జెండాను మడమ తిప్పకుండా పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. మహానాడులో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అడిగారు
తనను ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కలిసి.. ఇంతమంది కార్యకర్తలు టిడిపికి ఎలా ఉన్నారని, తాము డబ్బు, మద్యం.. ఇలా ఎన్ని ఇస్తున్నామని, కానీ టిడిపి కార్యకర్తలు ఏమీ ఆశించకుండా ఎలా శ్రమిస్తున్నారని అడిగారని లోకేష్ చెప్పారు.
అందుకు తాను.. మీ నాయకుడు పార్టీ కార్యకర్తలను పురుగులా చూస్తారని, ఏం జరిగినా పట్టించుకోరని, తమ నాయకుడు చంద్రబాబు మాత్రం కార్యకర్తలను పిల్లల్లా చూస్తారని, బిడ్డలుగా ఆదుకుంటారని ఆయనతో చెప్పానని అన్నారు.
వేలాదిమంది కార్యకర్తల పిల్లలను ఉచితంగా చదివించిన ఘనత టిడిపిదే అన్నారు. ఆ దొంగబ్బాయి కార్యకర్తలకు ఏమైనా చేశారా అని మండిపడ్డారు. తన తండ్రి మహానాయకుడని చెప్పుకున్న దొంగబ్బాయ్... కార్యకర్తలకు ఏం చేస్తున్నారన్నారు. తనలాంటి వారే కార్యకర్తలకు, వారి పిల్లలకు చాలా చేశానని, అలాంటిది చంద్రబాబు ఎంత చేయగలరో ఆలోచించాలన్నారు. తనకు ఆరు లక్షల మంది టిడిపి కార్యకర్తలే అండ అన్నారు.
కార్యకర్తలకు తాము ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పారు. అనారోగ్యం కలిగినా తక్షణం ఆదుకుంటామని చెప్పారు. మహానాడును పండుగలా మార్చింది కార్యకర్తలే అన్నారు. టిడిపికి బలం చిత్తశుద్ధి గల కార్యకర్తలే అన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలకు ఏదైనా చేశారా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు అండగా నిలబడేది టిడిపియేనన్నారు.

నారా లోకేష్
పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

నారా లోకేష్
బుధవారం టిడిపి మహానాడులో తొలిసారి నారా లోకేష్ ప్రసంగించారు. ఇతర పార్టీలకు లేని కార్యకర్తల శక్తి టిడిపికి మాత్రమే సొంతమన్నారు.

నారా లోకేష్
కార్యకర్తలను అధినేత చంద్రబాబు సొంత బిడ్డలా చేస్తారని చెప్పారు. వేలాది మంది కార్యకర్తల పిల్లలను ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో ఉచితంగా చదివిస్తున్నామని లోకేస్ వెల్లడించారు.

నారా లోకేష్
పదేళ్లుగా కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, ఎంతో మంది జైలు పాలయ్యారని ఈ సందర్భంగా నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం మహానాడు రెండో రోజు కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై స్పందించారు.

నారా లోకేష్
వేదిక పైకి వచ్చిన లోకేష్... తెలుగు జాతిలో ఏకైక నాయకుడు చంద్రబాబు అంటూ నమస్కరించారు. చంద్రబాబు ప్రతినమస్కారం చేశారు. తనకు లోకేష్ అని పేరు పెట్టి దీవించిన తాతగారికి నీరాజనాలు అన్నారు.

నారా లోకేష్
ముప్పై మూడేళ్లుగా ఎత్తిన పసుపు జెండాను మడమ తిప్పకుండా పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. మహానాడులో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లోకేష్ మాట్లాడుతుండగా చంద్రబాబు మౌనంగా విన్నారు.












Click it and Unblock the Notifications