మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుండి నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు మంగళగిరిలో లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరిలో లోకేష్ నామినేషన్ హడావిడి దుమ్ము రేపుతుంది.
లోకేష్ నామినేషన్ పత్రాలకు పూజలు
మంగళగిరిలో నేడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరఫున నామినేషన్ వేసే క్రమంలో స్థానిక టిడిపి నాయకులు నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు కూటమి నేతలు లోకేష్ నామినేషన్ కు పూజలు నిర్వహించారు. పాత మంగళగిరి సీతారామ కోవెలలో నారా లోకేష్ నామినేషన్ పత్రాలతో టిడిపి, బిజెపి, జనసేన కు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు పూజలు నిర్వహించారు.

10 వేల మందితో భారీ ర్యాలీ
నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు. ఇక ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపారు. ఆలయం నుండి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలుకు బయలుదేరారు. దాదాపు పదివేల మంది కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలుకు భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు
మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున స్థానిక నేతలు నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికలలో లోకేష్ ను గెలిపించాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, యువత తోపాటు ప్రజలు తరలివచ్చారు.
దుమ్ములేపుతున్న నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ..!!#NaraLokesh #NaraLokeshForMangalagiri #Mangalagiri #TDP #ApElections2024 #AndhraPradeshElection2024 #ApAssemblyElections2024 #Oneindiatelugu pic.twitter.com/F1XrbgYIb4
— oneindiatelugu (@oneindiatelugu) April 18, 2024
లోకేష్ నామినేషన్ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం
మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ ర్యాలీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు లోకేష్ ను ఆదరిస్తున్నారని, ర్యాలీ సందర్భంగా అడుగడుగునా మహిళలు, పట్టణ ప్రజల నీరాజనాలు పలుకుతున్నారని తెలుగుదేశం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన వేలాదిమంది టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు లోకేష్ కోసం ముందుకు సాగుతున్నారని, మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా కొనసాగుతున్న ర్యాలీలో భారీగా కూటమినేతలు పాల్గొన్నారని టిడిపి పేర్కొంది.
మంగళగిరిలో మోత పుట్టిస్తున్న టీడీపీ
పసుపుజెండాలు, టోపీలు ధరించి ఉత్సాహంగా ర్యాలీలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారని వీడియోలను షేర్ చేశారు. డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లుతున్న మంగళగిరి పట్టణం ఈసారి పట్టం కట్టడం ఖాయం అన్న చందంగా నామినేషన్ దాఖలుకే మంగళగిరిలో మోత పుట్టిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.












Click it and Unblock the Notifications