కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చౌదరి సేవలు మరువలేం: లోకేష్ నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కర్నూలు: రాజకీయాల్లో విలువలను పాటిస్తూ నిజాయితీగా సేవలందించిన రాంభూపాల్ చౌదరి సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ కొనియాడారు. మాజీమంత్రి వి. రాంభూపాల్ చౌదరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సూదిరెడ్డిపల్లెలో గురువారం పూర్తయ్యాయి. అంతకుముందు భౌతిక కాయానికి రాజకీయ నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సందర్శించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. చౌదరి మంత్రిగా పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేవారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చౌదరి తనవంతు సహకారం అందించారని లోకేష్ తెలిపారు. సీనియర్ నేతగా పార్టీకి ఆయన అందించిన సేవలు అందరికీ గుర్తుండిపోతాయని అన్నారు. చౌదరి మృతి పార్టీకి తీరని లోటన్నారు.

కాగా, మాజీ మంత్రి కావడంతో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రభుత్వ ప్రతినిధిగా సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కర్నూలుకు వచ్చి భూపాల్ చౌదరికి నివాళులర్పించారు. నారా లోకేష్‌తోపాటు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తదితర ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

కర్నూలు నుంచి ఉదయం స్వగ్రాం సూదిరెడ్డిపల్లెకు భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి అంతిమ యాత్రను ప్రారంభించారు. గ్రామ శ్మశాన వాటికలో పెద్ద కుమారుడు నవీన్ చితికి నిప్పంటించారు.

లోకేష్ నివాళి

లోకేష్ నివాళి

రాజకీయాల్లో విలువలను పాటిస్తూ నిజాయితీగా సేవలందించిన రాంభూపాల్ చౌదరి సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ కొనియాడారు.

రాంభూపాల్ చౌదరి

రాంభూపాల్ చౌదరి

మాజీమంత్రి వి. రాంభూపాల్ చౌదరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సూదిరెడ్డిపల్లెలో గురువారం పూర్తయ్యాయి.

ఓదార్పు

ఓదార్పు

అంతకుముందు భౌతిక కాయానికి రాజకీయ నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సందర్శించి నివాళులర్పించారు.

నివాళి

నివాళి

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. చౌదరి మంత్రిగా పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేవారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చౌదరి తనవంతు సహకారం అందించారని లోకేష్ తెలిపారు.

English summary
Telugudesam leader Nara Lokesh paid tributes to Late Ram Bhupal Chowdary in Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X