నేను ఒక్కడినే: దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ, 'టచ్‌లో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు'
విజయవాడ: దేవినేని నెహ్రూ వ్యక్తి కాదని, ఆయన ఓ వ్యవస్థ అని ఆయన తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాశ్ అన్నారు. దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ పట్ల నెహ్రూ అంకితభావం, క్రమశిక్షణ నచ్చడం వల్లే దివంగత ఎన్టీఆర్ ఆయనను ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారన్నారు.
Recommended Video

జనం కోసం జీవించిన నాయకుడు నెహ్రూ అన్నారు. కార్యకర్తలే శ్వాసగా తన తండ్రి బతికారన్నారు. తన తండ్రి నాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబుతో కలిసి నడిచారని చెప్పారు. తమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తనకు మంత్రి నారా లోకేష్ రాముడి లాంటి వాడని, తాను లక్ష్మణుడిలా అతని వెంట నడుస్తానని చెప్పారు.

ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న 10వ వ్యక్తి
తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకు సాగుతానని దేవినేని అవినాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేవినేని నెహ్రూ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పేరొందిన ెహ్రూ 1982లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న పదో వ్యక్తి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారన్నారు.

నేను ఒక్కడినే.. అవినాష్‌కు హామీ
దేవినేని అవినాశ్ క్రమశిక్షణ, ఓర్పు ఉన్న నాయకుడు అన్నారు.
తన తండ్రికి తాను ఒక్కడినే అని, తన తమ్ముళ్లుగా దేవినేని అవినాశ్, చంద్రశేఖర్‌లకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుటి తరానికి, ముందు తరాలకు దేవినేని నెహ్రూ గురువు అని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

టచ్‌లో పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేవినేని అవినాశ్‌కు సీటు కేటాయించాలని లోకేష్‌కు జలీల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

ఆ ఒకే ఒక్కడు పుస్తకం
కాగా, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలపై కోట రమేష్ రాసిన 'ఆ ఒకే ఒక్కడు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications